Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
అతివల అందానికి మరింత మెరుగులు దిద్దేది చేతి, కాలి గోళ్లు. ముఖ సౌందర్యంతో పాటు గోళ్ల సౌందర్యమూ చాలా ముఖ్యం. కానీ రోజు వారీ జీవితంలో ఎక్కువగా రాపిడికి గురయ్యేది గోళ్లు మాత్రమే. ముఖ్యంగా వంట చేసే సమయంలో, పాత్రలు కడిగే సమయంలో, బట్టలు ఉతికే సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురై విరిగిపోతూ ఉంటాయి. అయితే చర్మ సంరక్షణతో పాటు నెయిల్ కేరింగ్ చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

గోళ్ల ఆరోగ్యం పట్ల చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ గోళ్లు ఉండే ఆకృతిని బట్టే మన శరీరంలో ఏం లోపించిందో డాక్టర్లు చెప్పేస్తారు. పేలగా, నిర్జీవంగా ఉండే గోళ్లు శరీరంలో పోషకాల లోపాన్ని ఎత్తి చూపిస్తాయి. అయితే సరైన పోషకాహారం తీసుకున్నా కూడా కొందరు నెయిల్ కేరింగ్ తీసుకోరు. నెయిల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.. ఏం చేయకూడదో చర్మ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సీజన్‌తో సంబంధం లేకుండా మహిళలు గోరింటాకును ఇష్టపడతారు. ఈ క్రమంలో గోళ్లకి సైతం అప్లై చేస్తారు. ఇలా పెట్టుకోవడం ద్వారా గోరు బలహీనపడకుండా మందంగా తయారవుతుంది. దీంతో పని చేసేటప్పుడు గోళ్లు విరిగిపోకుండా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడూ గోరింటాకు పెట్టుకోవడం నెయిల్స్‌కి సురక్షితమని సూచిస్తున్నారు. కానీ.. ఇన్‌స్టంట్ మెహందీని వాడటం అంత శ్రేయస్కరం కాదు. ఇందులో రసాయనాలు, రంగులు కలపడం వల్ల.. ఇవి గోళ్లపై చేరి వాటి ఉపరితలాన్ని పొడిబారేలా చేసి, దెబ్బతీస్తాయి.
చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల క్యూటికల్స్ దెబ్బతింటాయి. దీనివల్ల నెయిల్స్ బలహీనంగా మారిపోతాయి. అంతేకాకుండా వంకరగా మారి ఇన్ఫెక్షన్ బారినపడేలా చేస్తాయి. ఇందుకోసం క్యూటికల్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా వాడాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. దీనివల్ల గోరుకు తేమ చేరి బలపడతాయి.
ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడూ గోళ్లకి నెయిల్ పాలిష్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా నెయిల్ పాలిష్ చేసుకోవడం వల్ల వాటిపై సహజ తేమ దెబ్బతిని గోర్లు పొడిగా, పెళుసుగా మారతాయి. దీనివల్ల అవి రంగు మారినట్లుగా అవుతాయి.

గోళ్లపై డస్ట్ తొలగించేందుకు లేదా నెయిల్ పాలిష్‌ను తొలగించేందుకు ఎసిటోన్ ఆధారిత రిమూవర్‌ను వాడుతుంటారు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల గోరులో సహజంగా ఉండే నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల గోళ్లు పొడిగా, పెళుసుగా మారిపోతాయి. ఇందుకు పరిష్కారం నాన్-ఎసిటోన్ రిమూవర్‌లను వాడాలని సూచిస్తారు. ఇవి నెయిల్స్‌పై సున్నితంగా పనిచేస్తూ గోళ్లు డీహైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది.
మీరు వాడే నెయిల్ టూల్స్‌ను ఇతరులతో పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఫంగల్, బాక్టీరియల్, వైరల్ నెయిల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా గోళ్లను మరీ పొట్టిగా కత్తిరించవద్దు. ఇలా చేస్తే గోరు మొదలు బయటపడి, నొప్పి పెడుతుంది. ఫలితంగా గాయాలయ్యే అవకాశం కూడా పెరుగుతుంది.
ఇంటి పనులు చేసేటప్పుడు గోళ్లను ఎక్కువ సేపు నీళ్లలో ఉంచడం వల్ల వాటిపై పగుళ్లు ఏర్పడి చీలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఉబ్బిపోయి కుచించుకుపోయి వాటి ఆకృతి బలహీనపడుతుంది. ముఖ్యంగా వంటగదిలో పాత్రలు కడిగేటప్పుడు గ్లౌజులు ధరించాలి. తద్వారా గోళ్లపై నీరు, డిటర్జెంట్ల ప్రభావం పడకుండా కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications