Latest Updates
-
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
వరల్డ్ డయాబెటిస్ డే 2024: మధుమేహం వ్యాధితో బాధపడుతున్న సీనీ తారలు వీళ్లే
డయాబెటిస్ లేదా మధుమేహం అనేది ఓ దీర్ఘకాలిక వ్యాధి. శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు లేదా సరిగ్గా ఉపయోగించలేనప్పుడు సంభవించే వ్యాధి ఇది. ఒక్కసారి డయాబెటిస్ వస్తే జీవితాంతం నరకమే అని చాలా మంది భావిస్తుంటారు. దీనికి కారణం దీనికి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ లేకపోవడమే. డయాబెటిస్ వస్తే ఫుడ్ నుంచి చాలా విషయాల్లో జాగ్రత్తలు తప్పసనిసరిగా తీసుకోవాలి..లేకుంటే తీవ్ర ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది మధుమేహంతో భాధపడుతున్నారని డబ్యూహెచ్ వో రిపోర్ట్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్నవాళ్లలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మధుమేహ రోగులలో 17% మంది ఇక్కడే ఉన్నారు కాబట్టే మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ అని పిలుస్తుంటారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం,అధిక కేలరీల ఆహారం తీసుకోవడం,శారీరకంగా చురుకుగా ఉండకపోవడం,తీవ్రమైన ఒత్తిడి కారణంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని అధిక కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా మధుమేహానికి కారణం కావచ్చు.
సాధారణ ప్రజలే కాదు చాలా మంది సెలబ్రిటీలు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే ను జరుపుకుంటారు. ఈ రోజులు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా డయాబెటిస్ తో భాధపడుతున్న పలువురు సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

సమంత
టాలీవుడ్ మోస్ట్ పాపులర్,గ్లామరస్ హీరోయిన్ సమంత కూడా డయాబెటిస్ బాధితురాలే. 2013లో ఓ ఇంటర్వూ సందర్భంగా తనకు డయాబెటిస్ ఉన్న విషయాన్ని సమంత తెలిపింది. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యాక్టివ్ గా ఉండటం,తన సింప్టమ్స్ ని రెగ్యులర్ గా పర్యవేక్షించడం ద్వారా తాను డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకుంటున్నట్లు శామ్ తెలిపింది.
సోనమ్ కపూర్
17 ఏళ్ల వయస్సులోనే బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ సోనమ్ కపూర్ టైప్ 1 డయాబెటిస్ బారినపడ్డారు. అయితే సోనమ్ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి తర్వాత రోజుల్లో ఫిట్‌నెస్ ఔత్సాహికురాలిగా మారింది. సోనమ్ చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది..రోజూ మూడు గంటల పాటు యోగా చేస్తుంది. సోనమ్ ఫిట్‌నెస్ లిస్ట్ లో వెయిట్‌లిఫ్టింగ్, పైలేట్స్, కార్డియో ఉంటుంది. పవర్ యోగా, స్విమ్మింగ్ కూడా సోనమ్ క్రమం తప్పకుండా చేస్తుంది.
కమలహాసన్
యూనిర్శల్ హీరో కమల్ హాసన్ కూడా మధుమేహంతో బాధపడుతున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కొనసాగించడం ద్వారా ఫిట్‌గా ఎనర్జిటిక్‌గా ఉంటూ కమల్ ఈ వ్యాధిపై పోరాడుతున్నారు. రెగ్యులర్ జిమ్ ఎక్సర్ సైజ్ లు, యోగా, మద్యపానానికి దూరంగా ఉంటూ తన కండీషన్ ని జాగ్రత్తగా ఉంచుకుంటారు కమల్.
నిక్ జోనాస్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కూడా మధుమేహం బారినపడ్డారు. 2015లో తాను టైప్ 1 డయాబెటిస్ బారిన పడినట్లు 2019లో సోషల్ మీడియాలో నిక్ తెలిపాడు. ఈ వ్యాధి సమయంలో తన జర్నీని కూడా నిక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వ్యాధి గురించి తనకు 14 ఏళ్ల క్రితమే తెలిసిందని, ఇది ఎవరినైనా ఒంటరిగా మరియు అందరి నుండి ఒంటరిగా చేసే వ్యాధి అని నిక్ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications