Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు ఉదయాన్నే ఏం తింటారో తెలుసా? ఫిట్ గా,ఆరోగ్యంగా ఉండాలంటే అది తినండి
ఫిట్ నెస్,ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఫిట్ నెస్,ఆరోగ్యంపై శ్రద్ద చూపడం తగ్గిపోతుంది. కొంతమంది సినిమా సెలబ్రిటీలు తమ ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి వంటి సినీ స్టార్స్ తమ ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ సెలబ్రిటీలు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి అసలు ఏం తింటారు, ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
శిల్పాశెట్టి
ఒకప్పుడు భారత సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి శిల్పాశెట్టి. ఈ మంగుళూరు భామ తరుచుగా తన ఫిట్ నెస్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటది. శిల్పా శెట్టి ఆహారపు అలవాట్లు,వ్యాయామ నియమాలు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నాయి. 49 ఏళ్ల వయస్సులో కూడా శిల్పాశెట్టి ఫిట్ గా ఉండటానికి యోగానే ప్రధాన కారణం. శిల్పా శెట్టి క్రమం తప్పకుండా యోా చేస్తుంది. ఆమె వెయిట్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు కూడా చేస్తుంది.ఉదయాన్నే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగే శిల్పాశెట్టి.. బ్రేక్ ఫాస్ట్ లోకి ఓట్స్, పోహా, పప్పు చీలా వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటుంది. ఆమె ఆహారంలో బ్రౌన్ రైస్, కూరగాయలు, పండ్లు, చికెన్, చేపలు వంటివి ఉంటాయి. శిల్పా శెట్టి చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటుంది.

అక్షయ్ కుమార్
ఫిట్ నెస్ విషయంలో ఈ బాలీవుడ్ హీరోని మించినవాళ్లు లేరు. 57 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ విషయంలో కుర్రోళ్లతో పోటీ పడుతుంటారు. అక్షయ్ కుమార్ క్రమశిక్షణకు మారుపేరు. ఆయన వ్యాయామం, యోగా, కార్డియోలకు ప్రాధాన్యతనిస్తారు. ఇవి ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ గా, టోన్ గా ఉంచుతుంది. ఆహారం విషయానికొస్తే అక్షయ్ కుమార్..ఉదయం పూట పాలు, పరాటాలు తీసుకుంటారు. ఇవి శరీరానికి కావాల్సిన ప్రోటీన్, శక్తిని అందిస్తాయి.
దీపికా పదుకొణె
భారత సినీ పరిశ్రమలోనే కాకుండా విదేశాల్లో కూగా తన నటనతో అద్భుతమైన ప్రశంసలు,ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన దీపికా పదుకొణె ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు. ఆమె బాడీ ఫిట్ నెస్ సీక్రెట్ తెలుసుకోడానికి ప్రజలు చాలా ఆసక్తి చూపుతారు. 39 ఏళ్ల వయస్సున్న దీపికా పదుకొణె ఫిట్ నెస్, అందం వెనుక సీక్రెట్ ఆరోగ్యకరమైన ఆహారమే. దీపికా పదుకొణె ఉదయం ఆహారంలో గ్రీన్ టీ, ఓట్ మీల్ తీసుకుంటుంది. దీపికాకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. దక్షిణ భారతీయ వంటకాలైన ఇడ్లీ, దోసెలను ఇష్టపడతారు. అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ, దోసె కూడా తీపుకుంటుంది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తుంది.
రణ్‌వీర్ సింగ్
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్..తన ఢిఫరెంట్ లుక్,స్టైల్,ఫిట్ నెస్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంటాడు. రణ్‌వీర్.. తన రోజును వ్యాయామం, కార్డియోతో ప్రారంభిస్తాడు, ఇది అతని శరీరాన్ని ఎల్లప్పుడూ శక్తివంతంగా, టోన్ గా ఉంచుతుంది. ఈ నటుడు ఉదయాన్నే ఎనర్జీ డ్రింక్స్ తాగుతాడు. ఆ తర్వాత అల్ఫాహారంలోకి ఓట్స్, డ్రై ఫ్రూట్స్, స్మూతీలు తీసుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications