Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మహిళలకు భారీ శుభవార్త..ఆ క్యాన్సర్ ని ముందే కనిపెట్టే మేడిన్ ఇండియా కిట్ లు వచ్చేశాయి..ఇక నో టెన్షన్
భారతీయ మహిళలకు భారీ శుభవార్త. మహిళలను వేధిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తించేలా దేశీయంగా అభివృద్ధి చేసిన RT-PCR ఆధారిత అత్యాధునిక HPV(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టెస్ట్ కిట్ లు బుధవారం(ఏప్రిల్ 23,2025) ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భారతదేశ హెల్త్ కేర్ సెక్టార్ లో గొప్ప ముందడుగు పడినట్లేనని చెప్పొచ్చు. మన శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు కలిసికట్టుగా ఈ అద్భుతాన్ని సృష్టించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మహిళలు ఈ కిట్లను ఉపయోగించుకోవచ్చు.
ఎవరు డెవలప్ చేశారు
కేంద్ర సైన్స్ అండ్ టైక్నాలజీ మంత్రిత్వశాఖలోని బయోటెక్నాలజీ విభాగం (DBT).. గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా (GCI) కార్యక్రమం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం అందించింది. DBT ద్వారా స్థాపించబడిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC)GCI కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఢిల్లీ ఈ టెస్ట్ కిట్‌ల అభివృద్ధి ప్రక్రియను సమన్వయం చేసింది. ఢిల్లీ ఎయిమ్స్ లోని గైనకాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ నీర్జా భట్ల ఈ ప్రాజెక్ట్ కు ముఖ్య నాయకత్వం వహించారు.

కేవలం టెస్ట్ కిట్ మాత్రమే కాదు
ఇది కేవలం ఒక టెస్ట్ కిట్ మాత్రమే కాదు..లక్షలాది భారతీయ మహిళల ఆరోగ్యానికి భరోసానిచ్చే ఒక పవర్ ఫుల్ వెపన్ అని, ఇదొక గేమ్ ఛేంజర్ అని మన శాస్త్రవేత్తలు తెలిపారు. సొంత వనరులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒక టెస్ట్ కిట్ ని మనం రూపొందించుకున్నట్లు తెలిపారు. దీని అభివృద్ధిలో WHO కి చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) సహకారం చాలా విలువైనదని చెప్పారు. ఢిల్లీ ఎయిమ్స్ సహకారంలో దేశంలోని ప్రముఖ ప్రయోగశాలల్లో ఈ టెస్ట్ కిట్ లు క్షుణ్ణంగా పరిశిలీంచబడ్డాయి.
గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటీ
ఇది మహిళల్లో వచ్చే సాధారణ క్యాన్సర్లలో ఒకటి. ముఖ్యంగా భారతీయ మహిళల్లో వచ్చే రెండో సాధారణ క్యాన్సర్ ఇది. గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయం కింది భాగంలో కణాలు అసాధారణంగా పెరగడం వల్ల ఇది వస్తుంది. దాదాపు అన్ని గర్భాశయ క్యాన్సర్లకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV)అనే వైరస్ కారణమవుతుంది. అయితే HPV ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రాదు..కాకుంటే కొన్ని రకాల HPV లు ప్రమాదకరమైనది, దీర్ఘకాలికంగా ఉంటే క్యాన్సర్ కు దారి తీయవచ్చు.
ప్రతి 5గురిలో ఒకరు మనదేశంలోనే
భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య. ప్రపంచంలో గర్భాశయ క్యాన్సర్ తో భాధపడుతున్న ప్రతి 5గురు మహిళల్లో ఒకరు భారతీయులే. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గర్భాశయ మరణాల్లో 25శాతం ఒక్క ఇండియాలోనే ఉండటం ఆందోళన కలిగించే విషయం. దీనికి ప్రధాన కారణం ప్రారంభంలోనే దీనిని గుర్తించలేకపోవడం. దీనిని ఆదిలోనే కనిపెడితే ట్రీట్మెంట్ ద్వారా నయం చేయవచ్చు. అయితే ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్ ల ద్వారా ప్రారంభంలోనే దీనిని గుర్తించడం వీలవుతుంది.
HPV టెస్ట్ కిట్ ల తయారీ కార్యక్రమానికి సారధ్యం వహించిన నీర్జా భట్ల ఈ ఆవిష్కరణ ప్రాధాన్యతను వివరించారు. ఈ టెస్ట్ కిట్ లు కేవలం ఏడు లేదా ఎనిమిది అత్యంత సాధారణమైన క్యాన్సర్ ను కలిగించే రకాలను మాత్రమే గుర్తిస్తాయన్నారు. ఇది అత్యంత అనుకూలమైన, సమర్థమైన, అందుబాటు ధరలో ఉండే స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని ఆమె చెప్నారు.
WHO లక్ష్యం ఇదే
గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా WHO..అన్ని దేశాలల్లో HPV టెస్ట్ కు మారాలని సూచిస్తోంది. దీని ప్రకారం ఒక మహిళ తన జీవితకాలంలో 35-45 ఏళ్ల మధ్యలో కేవలం రెండు టెస్టులు చేయించుకుంటే సరిపోతుంది. 2020 నాటికి అర్హత కలిగిన 70 శాతం మంది మహిళలను పరీక్షించడానికి అవసరమైన ప్రక్రియలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్ భట్ల తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











