Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులు.. అందుబాటులో వ్యాక్సిన్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆడవారిని బ్రెస్ట్ క్యాన్సర్ తరువాత భయాన్ని రేపుతున్న మరో క్యాన్సర్ గర్భాశయ క్యాన్స్‌ర్ దీనినే ఆంగ్లంలో మెడికల్ పరిభాషలో సర్వైకల్ క్యాన్సర్‌గా చెప్పుకుంటాము. భారత దేశంలో సర్వైకల్ క్యాన్సర్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నారు. ప్రతీ 8 నిమిషాలకు ఓ మహిళ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణిస్తోందంటే ఆ క్యాన్సర్‌కు ఉన్న తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

అవగాహణ లేకపోవడం
ఈ గర్భాశయ క్యాన్సర్ నివారించడానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. కానీ అవగాహన లేకపోవడం వల్ల ప్రతీ సంవత్సరం లక్షన్నర మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. 2025 నాటికి ఆ సంఖ్య 2 లక్షలు దాటుతుందంటున్నారు.
హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొన్నవారికి ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. శృంగారం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ సోకిన ప్రతీ ఒక్కరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. ఇటు మహిళలతో పాటు అటు పురుషులకు కూడా ఈ వైరస్‌సోకి ఇతర అనారోగ్య సమస్యలను గురయ్యే అకవాశం ఉంది.
ముందుగానే వ్యాక్సిన్
ఈ సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించాలంటే 9 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న అందరు యువతులు ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. 21 ఏళ్లు నిండిన యువతులు, పెళ్లై శృంగారంలో పాల్గొని రెండేళ్లు అయిన మహిళలు పీఏపీ(పపనికోలౌ) పరీక్ష తప్పకుండా చేసుకోవాలి. ఈ టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించి వెంటనే చికిత్స చేసే వీలుంటుంది.
మూడు రకాలుగా హెచ్‌పీవీ వైరస్
హ్యూమన్ పాపిలోమ వైరస్ మూడు రకాలుగా ఉంటుంది. హైరిస్క్ హెచ్‌పీవీ, లోరిస్క్ హెచ్‌పీవీ, సాధారణ హెచ్‌పీవీ. హెచ్‌పీవీ స్థాయి 16, 18గా ఉంటే హైరిస్క్‌గా పరిగణిస్తారు. ఇవే క్యాన్సర్‌కు దారితీస్తుంది. హైరిస్క్ ఉన్నవారిలో డెబ్బై శాతం సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఇక లోరిస్క్ హెచ్‌పీవీ స్థాయి 6, 11గా ఉంటుంది. లోరిస్క్ ఉన్నవారిలో 90 శాతం మందికి జననేంద్రియాలపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఇవే దద్దుర్లు తరువాత క్యాన్స్‌కు ప్రధాన కారణమౌతాయ్.
సాధారణ హెచ్‌పీవీలో లక్షణాలు ఎక్కువగా కనిపించవు. దానంతట అదే తగ్గిపోతుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ సోకగానే లక్షణాలు కనిపించడానికి చాలా సమయం పడుతుంది. వ్యాధి తీవ్రమవుతేనే దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయ్.
హెచ్‌పీవీ వ్యాక్సిన్
9 నుంచి 45 ఏళ్ల మహిళలు ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. 50 ఏళ్లు నిండిన మహిళకు ఈ సర్వైకల్ క్యాన్సర్ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications