Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చియా vs సబ్జా..సమ్మర్ లో ఏది తీసుకోవడం ఉత్తమం?
సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి కారణంగా శీరరం డీహైడ్రేట్ అవడం(శరీరంలో నీటి శాతం లేకపోవడం),నీరసం రావడం వంటి సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. ఈ సీజన్ లో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం మీ ఆహారంలో చియాసీడ్స్, సబ్జా గింజలు వంటి ప్రత్యేకమైన సూపర్ ఫుడ్స్ ని చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు. చియా సీడ్స్, సబ్జా గింజలు రోండూ చూడటానికి ఒకేలా ఉంటాయి కానీ వాటిలో పోషకాలు,ఆరోగ్య ప్రనయోజనాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. అయితే సమ్మర్ సీజన్ లో ఆరోగ్యానికి ఏది ఎక్కువగా మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
చియా గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు
చియా గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి నీటిని పీల్చుకొని జెల్ మాదిరి మారతాయి. దీనిని తీసుకోవడం వల్ల కండునిండిన భావన కలుగుతుంది..దీంతో అతిగా తినడం తగ్గిపోయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందించి నీరసం రాకుండా కాపాడతాయి. రక్తంలో షుగర్ లెవల్స్ ని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చియా గింజలను నీటిలో నానబెట్టి,జ్యూసులు లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు.

సబ్జా గింజలతో లభించే ప్రయోజనాలు
సబ్జా గింజలు శరీరాన్ని చల్లబర్చే గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఐరన్, ఫైబర్, మెగ్నీసియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. మలబద్దకం సమస్యను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కూడా సబ్జా గింజలు సహాయపడతాయి. సబ్జా గింజలను నీళ్లల్లో నానబెట్టి, నిమ్మరసం, మజ్జిగ, ఫలూదా వంటి చల్లని డ్రింక్స్ లో కలుపుకొని తాగొచ్చు. షుగర్ పేషెంట్లకు కూడా సబ్జా గింజలను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
సమ్మర్ లో ఏది ఎక్కువ మేలు చేస్తుంది
సబ్జా గింజలు, చియా గింజలు రెండూ ఆరోగ్యానికి అనేకరకాలుగా ప్రయోజనాలు అందించేవే అయినప్పటికీ సమ్మర్ లో సబ్జా గింజలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సబ్జా గింజలు శరీరాన్ని సహజంగా చల్లబరుస్తాయి. ఇవి శరీరానికి త్వరగా నీటిని అందించి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. సబ్జా గింజల ఈ ప్రత్యేక లక్షణాల కారణంగా సమ్మర్ లో దీనిని తీసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. త్వరగా శరీరానికి హైడ్రేషన్ అందించే సామర్ధ్యం ఉంటుంది కాబట్టి వీటిని ఎండాకాలంలో తీసుకోవడం చాలా చాలామందిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సమ్మర్ లో అప్పుడప్పుడూ చియా విత్తనాలను కూడా తీసుకోవడం కూడా మంచిదని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications