Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
Chicken : చికెన్ తినేవాళ్లకి బిగ్ షాకింగ్ న్యూస్..చనిపోయే ప్రమాదం ఉందట!
చికెన్ ఆరోగ్యానికి మంచిదే అని లాగించేస్తున్నారా? ముక్క లేనిదే మీకు ముద్ద దిగదా? నాన్ ఉంటేనే తింటారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. తరుచుగా చికెన్ తినేవాళ్లకు జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని..అన్ని రకాల మరణాల ముప్పు ఎక్కువగానే ఉంటుందని ఇటలీ దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
దీంతో ఇప్పుడు చికెన్ తినడం మనం అనుకున్నంత ఆరోగ్యకరమైనదా? చికెన్ తింటే ప్రాణాలమీదకి తెచ్చుకున్నట్లేనా? ఈ అధ్యయనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై నిపుణలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. వారానికి 300గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే డేంజరేనని..తక్కువ మొత్తంలో తినేవారికంటే వీరిలో మరణాల ముప్పు పెరిగే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. ఎక్కువ మొత్తంలో కోడిమాంసం తినడం వల్ల జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 2.3 శాతం పెరగుతుందని, పురుషుల్లో అయితే ఈ ప్రమాదం 2.6శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. కాగా ఈ అధ్యయనికి సంబంధించిన వివరాలు న్యూట్రియంట్స్ అనే జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.

తాజా అధ్యయన ఫలితాలు నాన్ వెజ్ ఎక్కువగా తినోటోళ్లకు టెన్షన్ తెప్పించేలా ఉంది. ఒక ఆహార పదార్థానికి, క్యాన్సర్ కు మధ్య ఉన్న సంబంధంపై ఖచ్చితమైన నిర్ధారణకు రావడానికి కేవలం పరిశీలనా అధ్యయనాల ఫలితాలు సరిపోవని నిపుణులు స్పష్టం చేశారు. ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇది కేవలం పరిశీలనాత్మకమైనది. కాబట్టి దీని ఆధారంగా ఒక నిర్దిష్ట కారణాన్ని చెప్పలేమని.. సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా చికెన్ తీసుకోవడం ఇప్పటికీ మంచిదని విస్తృతమైన ఆధారాలు సూచిస్తున్నాయని నిపుణులు తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారంలో పౌల్ట్రీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని.. ఈ అధ్యయనం ఫలితాలను అర్థం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఒక్కొక్క వ్యక్తిలో క్యాన్సర్ ఎలా అభివృద్ధి చెందుతుందనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని..జన్యువులు, పర్యావరణం, ఆహారం, వ్యాయామం, విష పదార్థాల ప్రభావం, వయస్సు వంటి అనేక అంశాలు ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తాయి కాబట్టి మనం ఏదైనా అధ్యయనాన్ని పరిశీలించినప్పుడు దానిని మన జీవనశైలికి ఎలా వర్తింపజేయవచ్చో ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ అధ్యయనం ఆసక్తికరమైన విషయాలను తెలియజేసినప్పటికీ మనం తొందరపడి నిర్ధారణలకు రాకూడదని. మీ ఆహారపు అలవాట్ల గురించి మీకు ఏమైనా ఆందోళనలు ఉంటే వెంటనే వైద్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications