కొత్తగా తల్లయిన వారికి అలర్ట్‌.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!

అప్పుడే పుట్టిన పిల్లలకు కొంతకాలం తల్లిపాలు ఇచ్చిన తర్వాత ఏం తినాలి, ఏం తినిపించకూడదనే చాలా మంది తల్లుల్లో సందేహం నెలకొంటుంది. ముఖ్యంగా చక్కెర విషయంలో ఆందోళన ఎక్కువవుతుంటుంది. పిల్లలకు చక్కెర ఎప్పుడు తినిపించాలి.. ఏ వయసు వరకు చక్కెరతో చేసిన తీపి పదార్థాలు తినిపించకూడదనే దానిపై స్పష్టత ఉంటదు. అయితే దీనిపై అమెరికాలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రొసీడింగ్స్‌ అధ్యయనం చేసింది. దీని ప్రకారం పిల్లల ఆరోగ్యం విషయంలో కీలక సూచనలు చేస్తున్నారు.

Children can prevent future diseases by avoiding sugar during their first two years

కొత్తగా తల్లులైన వారు కొందరు తమ బిడ్డకు పుట్టిన వెంటనే చక్కెర కలిపిన పాలు ఇస్తుంటారు. అయితే ఈ ప్రభావం అప్పుడే కనిపించదు. వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావాలు కనిపిస్తాయి. పుట్టిన తర్వాత పిల్లలకు రెండు లేదా మూడేళ్ల వరకు చక్కెర తినిపించకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పద్ధతిని పాటించడం ద్వారా భవిష్యత్తులో వారు పెద్దయ్యాక క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించగలదని వెల్లడిస్తున్నాయి. అందుకే పుట్టిన తర్వాత మీ బిడ్డను కొంతకాలం ఈ తెల్లటి విషయాన్ని దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!

చక్కెరతోనే వ్యాధుల ప్రభావమా.?

పరిశోధన ప్రకారం.. పిల్లలు పుట్టిన మొదటి 1000 రోజుల పాటు చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేయడం, తగ్గించడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వెల్లడిస్తుంది. చక్కెర తక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో టైప్ 2 డయాబెటిస్, ఇతర జీవక్రియ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందనే నమ్మకం అన్ని సందర్భాల్లోనూ ఒకేలా ఉండదని అంటున్నారు.

Children can prevent future diseases by avoiding sugar during their first two years

ఇతర వ్యాధుల ప్రమాదాలు

పిల్లలు చిన్నతనం నుంచే చక్కెర, చక్కెరతో చేసిన ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే వారిలో డయాబెటిస్‌ ప్రమాదం మాత్రమే కాదని, ఊబకాయం, ఇన్సులిన్‌ పనితీరులో లోపాలు, ఎక్కువ కాలం పాటు అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వంటివాటికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే వీటిని పిల్లలు జీవితాంతం మానేయాల్సిన అవసరం లేదు. చాక్లెట్లు, స్వీట్లు వంటి వాటిని ఎంత మోతాదులో, ఎతం తీసుకుంటున్నారనేది ముఖ్యం. అప్పుడప్పుడూ తీసుకోవడానికి, ఎప్పుడూ తీసుకోవడానికి చాలా తేడా ఉంటుందని గమనించాలి.

రాత్రుల్లో తరచూ మూత్ర విసర్జనకు లేస్తున్నారా?జాగ్రత్త మీకు ఈ 5 ప్రాణాంతక వ్యాధుల్లో ఏదోఒకటి ఉన్నట్లే..రాత్రుల్లో తరచూ మూత్ర విసర్జనకు లేస్తున్నారా?జాగ్రత్త మీకు ఈ 5 ప్రాణాంతక వ్యాధుల్లో ఏదోఒకటి ఉన్నట్లే..

తల్లిదండ్రులు అలర్ట్‌

పిల్లలకు చిన్నతనం నుంచే చక్కెర వినియోగం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారేలా చూసుకోండి. తాజా పండ్లు, పాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్‌ వంటి పోషక ఆహార పదార్థాలను అందించడం వారి మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. చిన్నతనం నుంచే శారీరక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి. స్వీట్లు, హాట్‌ వంటి వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు. దీర్ఘకాలం ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించినట్లయితే అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, September 4, 2026, 11:51 [IST]
Desktop Bottom Promotion