Latest Updates
-
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
15 నిమిషాల్లోనే ఇంట్లోనే పిల్లల జ్వరాన్ని తగ్గించడం ఎలా? డాక్టర్ చెప్పిన మ్యాజిక్ టెక్నిక్
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు పేరెంట్స్ లో ఆందోళన మొదలవుతుంది. వెంటనే ఫీవర్ సిరప్ పట్టేస్తారు..కానీ అది పని చేయడానికి కనీసం అరగంట పడుతుంది. ఈలోగా జ్వరం మరింత పెరిగితే ఎలా? ఈ టైంలో బిడ్డకు తక్షణ ఉపశమనం ఉలా కలిగించాలి?
చాలామంది పేరెంట్స్ ని వేధించే ఈ ప్రశ్నకు ఖమ్మంలోని ప్రసిద్ధ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ పీడియాట్రిక్స్ డాక్టర్ గౌతమ్ ఒక ఈజీ,ఎఫెక్టివ్ పరిష్కారాన్ని సూచిస్తున్నారు.

కేవలం ఫీవర్ సిరప్ మీద ఆధారపడకుండా తడిగుడ్డతో సరైన పద్ధతిలో తుడవడం ద్వారా పిల్లల్లో అధిక జ్వరాన్ని కేవలం 15-20 నిమిషాల్లో నియంత్రణలోకి తీసుకురావచ్చని డాక్టర్ గౌతమ్ తన ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా వివరించారు.
ఎందుకు తడిగుడ్డతో తుడవాలి
పిల్లల బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు వారి చర్మంపై గోరువెచ్చని నీటితో తడిపిన గుడ్డతో తుడవడం వల్ల ఎవాపరేటివ్ కూలింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే, చర్మంపై ఉన్న నీరు ఆవిరిగా మారే క్రమంలో శరీరం లోపలి వేడిని గ్రహిస్తుంది.
దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా,సురక్షితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది జ్వరానికి తాత్కాలికంగా వేగవంతమైన ఉపశమనాన్ని అందిస్తుంది. ఫీవర్ సిరప్ లోపలి నుంచి పనిచేయడం ప్రారంభిస్తే..తడిగుడ్డతో తుడిచే పద్ధతి బయట నుండి సహాయపడుతుంది.
డాక్టర్ గౌతమ్ సూచించిన సరైన పద్ధతి ఇదే
అధిక జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు ఉపశమనం కలిగించడానికి ఈ కింద సూచించిన పద్ధతిని పాటించండి.
కావాల్సినవి సిద్ధం చేసుకోండి: ఒక శుభ్రమైన గిన్నె, గోరువెచ్చని నీళ్లు (చల్లని నీళ్లు అస్సలు వాడొద్దు), రెండు మెత్తటి కాటన్ లేదా మస్లిన్ గుడ్డలు.
నీటిని సిద్ధం చేయండి: గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోండి. నీరు మరీ వేడిగా గానీ, చల్లగా గానీ ఉండకూడదు. మీ మోచేతితో నీటి ఉష్ణోగ్రతను పరీక్షించవచ్చు.
తుడవడం ప్రారంభించండి: ఒక కాటన్ గుడ్డను నీటిలో ముంచి, అదనపు నీటిని పూర్తిగా పిండేయండి. ఇప్పుడు ఈ తడి గుడ్డతో నుదుటిపై నెమ్మదిగా తుడవాలి.
తర్వాత మెడ చుట్టూ తడవాలి. మెడ భాగంలో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి, కాబట్టి ఇక్కడ తుడవడం వల్ల వేడి త్వరగా తగ్గుతుంది.
ఆ తర్వాత చంకలలో తుడవాలి. చంకలు కూడా అధిక వేడిని విడుదల చేసే ప్రాంతాలు.
డాక్టర్ గౌతమ్ చెప్పినట్టు ఈ మూడు ప్రదేశాల (నుదురు, మెడ, చంకలు) నుండి వేడి అత్యంత వేగంగా బయటకు వెళ్తుంది.
ఆ తర్వాత చేతులు, కాళ్లు, పొట్ట, వీపు భాగాలను కూడా అదే గుడ్డతో సున్నితంగా తుడవాలి. ఒక గుడ్డ చల్లబడితే, రెండవ గుడ్డను ఉపయోగించండి. ఈ ప్రక్రియను 15 నుండి 20 నిమిషాల పాటు చేయవచ్చు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి డిజిటల్ థర్మామీటర్‌తో జ్వరాన్ని చెక్ చేస్తూ ఉండాలి.
పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు
-ఎట్టిపరిస్థితుల్లోనూ చల్లని లేదా ఐస్ వాటర్ అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఇది రక్తనాళాలను సంకోచింపజేసి, వేడి బయటకు వెళ్లకుండా లోపలే బంధిస్తుంది. అంతేకాకుండా పిల్లలకు వణుకు పుట్టించి జ్వరాన్ని మరింత పెంచుతుంది.
-తుడుస్తున్న సమయంలో పిల్లలు వణకడం ప్రారంభిస్తే వెంటనే ఆపేసి పలుచటి దుప్పటి కప్పండి. వణుకు అంటే శరీరం ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని అర్థం.
-పిల్లలకు జ్వరం సమయంలో మందపాటి దుస్తులు వేయకూడదు. గాలి ఆడేలా పలుచటి కాటన్ దుస్తులు వేయాలి.
-జ్వరం వచ్చినప్పుడు శరీరం డీహైడ్రెట్ అవుతుంది కాబట్టి పిల్లలకు తరచుగా నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ వంటివి అందిస్తుండాలి.

ఎప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి?
-తడిగుడ్డతో తుడిచి ఫీవర్ సిరప్ వేసినా కూడా జ్వరం 103°F కన్నా తగ్గకపోతే లేదా కింది లక్షణాలు కనిపిస్తే తక్షణం డాక్టర్ ని సంప్రదించాలి.
-మూడు నెలల కంటే తక్కువ వయసున్న శిశువుకు జ్వరం వస్తే.
-జ్వరం 104°F దాటితే.
-పిల్లలు మత్తుగా, నీరసంగా, స్పృహ లేకుండా ఉంటే.
-తీవ్రమైన తలనొప్పి, మెడ పట్టేయడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే.
-శరీరంపై దద్దుర్లు కనిపిస్తే.
-ఫిట్స్ వస్తే.
-పిల్లలు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు రాకపోవడం, నోరు పొడిబారడం, 6-8 గంటల పాటు మూత్రం పోయకపోవడం వంటి డీహైడ్రేషన్ సంకేతాలు కనిపిస్తే.
డాక్టర్ గౌతమ్ సూచించిన ఈ సులభమైన, సురక్షితమైన పద్ధతిని పాటించడం ద్వారా అధిక జ్వరం నుండి మీ పిల్లలకు తక్షణ ఉపశమనం కలిగించవచ్చు. అయితే, ఇది కేవలం ప్రథమ చికిత్స మాత్రమేనని గుర్తుంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











