Latest Updates
-
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా..
ఏం తిని చచ్చారురా మళ్లీ: చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ!..భారీగా మరణాలు
చైనా నుంచి ప్రపంచదేశాలకు పాకిన కరోనా వైరస్ ఎంత బీభత్సం సృష్టించో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వైరస్ దెబ్బకు కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా మరణాలు నమోదయ్యాయి. మూడేళ్ల క్రితం కరోనా వైరస్ పేరు వినబడితేనే హడలిపోయేవాళ్లు అంతా. కరోనా వైరస్ కి పుట్టినిళ్లుగా చైనాని భావిస్తారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ భయంకరమైన వైరస్ బయటికొచ్చినట్లు అనేక ఆరోపణలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో అనేకసార్లు ఈ విషయాన్నే చెప్పారు. చైనా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటికొచ్చినట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ ఇప్పుడు ఇలా
ఇప్పుడు మరోసారి చైనా వైరస్ ల బారిన చిక్కుకొని విలవిలలాడుతోంది. పలు రకాల వైరస్ ల వ్యాప్తితో డ్రాగన్ దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతున్నారు. వైరస్ ల బారిన పడిన పేషెంట్లతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

హెల్త్ ఎమర్జెన్సీ
కరోనా తర్వాత ఇప్పుడు మరోసారి చైనా దేశంలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తోంది. కోవిడ్ 19తో పాటు మైక్రోప్లాస్మా న్యూమోనియా,ఇన్ ఫ్లూయెంజా-A,HMPV వంటి వైరస్ లో చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. చైనాలో పలు వైరస్ ల మూకుమ్మడి వ్యాప్తి నేపథ్యంలో జిన్ పింగ్ ప్రభుత్వం చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వైరస్ ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.
HMPV వైరస్ కేసుల పెరుగుదల
చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం ఈ వైరస్ 2001లో కనుగొనబడింది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగించే వైరస్. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కేసులు ప్రస్తుతం చైనాలో ఎక్కవగా ఉన్నట్లు తెలుస్తోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
