Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
మన దేశంలోకి ప్రవేశించిన చైనా వైరస్..సంక్రాంతికి ఎక్కువ బట్టలు తీసుకెళ్లండి,మళ్లీ లాక్ డౌన్?
ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హ్యూమన్ మెటాప్ న్యుమో వైరస్(HMPV) మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మన దేశంలో తొలి కేసు నమోదైంది. హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. బెంగళూరులో 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా,తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్టులు చేయగా ఆ చిన్నారిలో HMPV వైరస్ కనుగొనబడింది. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది,అధికారులు అలర్ట్ అయ్యారు. కాగా, ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్, స్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని సమాచారం.
కరోనా పీడ పోయిందనుకుంటే కొత్తగా మళ్లీ ఇదేం వైరస్ రా బాబు అని జనాలు తలలు పట్టుకుంటున్నారు. హెచ్ఎంపీవీ పేరుతో ఇప్పటికే యాక్టివ్ కేసులు పెరుగుతూ చైనా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న సమయంలో ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది.

HMPV లక్షణాలివే
హ్యుమన్ మెటాప్ న్యూమో వైరస్(HMPV) సాధారణంగా ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవాళ్లు తుమ్మిన లేదా దగ్గిన శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. నలుగురిలో ఉన్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
20 ఏళ్ల క్రితమే ఈ వైరస్
ఓ నివేదిక ప్రకారం ఈ వైరస్ 2001లోనే కనుగొనబడింది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగించే వైరస్. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చైనా, జపాన్‌లో ప్రస్తుతం 7 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్త వైరస్ పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. మళ్లీ కేసులు పెరిగితే మనదేశంలో లాక్‌డౌన్ రావడం పక్కా అని కొందరు అంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications