Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మరో దేశానికి పాకిన చైనా HMPV వైరస్.. ఈ లక్షణాలు ఉంటే మీకు కూడా ఈ వైరస్ ఉన్నట్లే!
చైనాలో హ్యూమన్ మెటాప్ న్యుమో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా లక్షణాలు ఉండడంతో పాటు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రజలందరూ బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాలోని ఆసుపత్రులు, స్మశాన వాటికలు నిండిపోతున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. జపాన్‌లో కూడా ఈ వైరస్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? దానిని ఎలా నివారించుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
HMPV వైరస్ లక్షణాలు
ఈ వైరస్ సోకిన వారిలో ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయి. శ్వాసకోస వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే దగ్గు, జ్వరం కొన్ని సందర్భాల్లో వాసన కోల్పోవడం, రుచి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మొదట జలుబు, దగ్గు వస్తుంది. తరువాత కొద్దిపాటి జ్వరంతో ఈ వైరస్ ప్రభావం మొదలవుతుంది. క్రమంగా ఊపిరి తిత్తులను ప్రభావితం చేస్తుంది. గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తీవ్రమవుతాయి. క్రమంగా మృతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ వైరస్ సోకిన వారు దగ్గినా తుమ్మినా, శారీరక సంబంధాల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది. కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా ఇతరులపై వేగంగా దాడిచేయగలదు. కరోనా మాదిరిగానే లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే దీని గురించి అందరూ అంతలా భయపడుతున్నారు.
నివారణ మార్గాలు
ఈ వైరస్ ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. కాలక్రమేణా చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. మాస్క్‌ను తప్పనిసరిగా వినియోగించాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు కచ్చితంగా గుడ్డను ముఖానికి అడ్డం పెట్టుకోవాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ HMPV వైరస్‌ను 20 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు కనుగొనినట్లు తెలుస్తోంది. చైనా, జపాన్ దేశాల్లో ప్రస్తుతం 7 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications