Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చైనాలో కరోనా లాంటి మరో వైరస్? మళ్లీ భారీ వినాశనం తప్పదా?
వైరస్ లకు పుట్టినిళ్లుగా మారిపోయింది చైనా దేశం. నాలుగేళ్ల క్రితం చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్(Covid 19) తర్వాత ప్రపంచదేశాలన్నింటికీ పాకి ఎంత బీభత్సం సృష్టించిదో మనందరికీ తెలిసిందే. అయితే కరోనా లాంటి మరో వైరస్ మళ్లీ ప్రపంచంపై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యిందా? మరోసారి భారీ వినాశనం తప్పదా? జంతువు నుండి మానవునికి సంక్రమించే ప్రమాదాన్ని కలిగి ఉన్న కొత్త.. గబ్బిల కరోనా వైరస్‌ను చైనా బృందం తాజాగా కనుగొంది. దీనికి HKU5-CoV-2 అని పేరు పెట్టారు. కొత్త వైరస్..కరోనాకి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారట.
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్(HMPV) ఇటీవల చైనాలో కొద్ది రోజులపాటు బీభత్సం సృష్టించినట్లు అంతర్జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సహా అనేక ప్రపంచదేశాలు అలర్ట్ కూడా అయ్యాయి. ప్రపంచంవ్యాప్తంగా HMPV భయాందోళలను పెంచింది. అయితే కొద్ది రోజుల్లోనే ఇప్పుడు మళ్లీ మరో కోవిడ్ తరహా వైరస్ వెలుగులోకి వచ్చిందంటూ హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన కథనం చూసి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ విధ్వంసం తప్పదా అని చాలామంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం గబ్బిలాల కరోనావైరస్ లపై విస్తృతమైన పరిశోధనల కారణంగా బ్యాట్ ఉమెన్ అని పిలువబడే ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో తొలుత హాంకాంగ్ లోని జపనీస్ పిపిస్ట్రెల్లే రకం గబ్బిలాల్లో HKU5-CoV-2 వైరస్ ని గుర్తించారు. ఈ పరిశోధనలో గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్శిటీ అండ్ వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వీరి పరిశోధనల వివరాలు సైంటిఫిక్ జర్నల్ సెల్ లో ప్రచురించారు.
ఈ కొత్త వైరస్ ని..మెర్బెకో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్ కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. కొవిడ్-19తో పోలిస్తే ఈ వైరస్ సామర్థ్యం తక్కువేనని,వ్యాపించే ప్రమాదం కూడా తక్కువగా ఉందన్నారు. ఈ వైరస్ మానవ కణాలకు, కృత్రిమంగా పెరిగిన ఊపిరితిత్తులు, పేగు కణజాలాలకు సోకుతుందని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. మానవులు, గబ్బిలాలు, ఇతర జంతువులలోని ACE2 గ్రాహకాలతో కూడా ఇది బైండ్ అవగలదని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications