Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Heart Attack: గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి, చిన్న వయస్సులో గుండెపోటుకు కారణాలు ఏంటంటే..
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యువత హృదయాలను స్ట్రోక్ కబళిస్తోంది. ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తున్న వార్తలు రోజూ వస్తూనే ఉన్నాయి. పెద్ద వారిలో గుండెపోటు రావడం గురించి వదిలేస్తే.. యువతలో రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందడం ఆందోళనలు రేకెత్తిస్తోంది.
గ్రేటర్ నోయిడాలో 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటూ పడి పోయిన విద్యార్థి రోహిత్ సింగ్ ను ఉపాధ్యాయులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దవాఖానాకు తరలించేలోపే విద్యార్థి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

రోహిత్ సింగ్ పడిపోగానే అతని కాళ్లు, చేతులకు రాపిడి చేశామని, నీళ్లు తాగించేందుకు ప్రయత్నించామని, ఎంతకీ స్పృహ రాకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. వేసవికాలం కాబట్టి డీహైడ్రేషన్ కు గురయ్యాడేమో అని ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించడానికి ప్రయత్నించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ నూతన్ సక్సేనా తెలిపారు. ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు వారిలోనూ గుండె పోటు వస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. జీవనశైలి, జన్యుపరమైన కారణాల వల్ల గుండెపోటు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చిన్న వయస్సు వారిలో గుండెపోటుకు కారణాలు:
ఈ మధ్యకాలంలో గుండెపోటు కేసులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. 25 ఏళ్ల లోపు వారిలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగాయి. కార్డియోలజిస్టుల వద్దకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. యువకుల్లో గుండెపోటు రావడానికి జీవన శైలి, జన్యుపరమైన కారణాలని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కదలకుండా ఉండే జీవనశైలి వల్ల ఎక్కువ మందిలో గుండెపోటు వస్తున్నట్లు ప్రాథమికంగా చెబుతున్నారు వైద్యులు. ఇంకా ఏమేం కారణాలు ఉండొచ్చంటే..
* ధూమపానం
* మద్యపానం
* శారీరక శ్రమ లేకపోవడం
* బీఎంఐ అధికంగా ఉండటం
* డయాబెటిస్
* రక్తపోటు
* డైస్లిపిడెమియా
* పాస్ట్ స్ట్రోక్
* జన్యుపరమైన రుగ్మతలు
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు:
* పౌష్టికాహారం తినడం
* ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం
* ఉప్పు తక్కువగా తినడం
* రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం
* ధూమపానం మానేయడం
* రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుకోవడం
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications