Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కాఫీ తాగితే పార్కిన్సాన్స్ వ్యాధికి చాన్స్ లేనట్టే.. కాఫీనా మజాకా..!
కాఫీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. కాఫీనే కదా అని చులకనగా చూస్తే వాటి నుంచి వచ్చే ఎన్నో పోషకాలను మిస్ అవుతారు. కాఫీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వుండడం నిజమే. ఈ సైడ్ ఎఫెక్టులు కాఫీ ఎక్కువగా తాగిన వారిలో వుంటుంది. రోజుకు మితంగా కాఫీ తాగితే ఆరోగ్యం, శృతి మించితే అనారోగ్యం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, సంతోషించదగిన విషయమేంటంటే కాఫీ తాగితే పార్కిన్సాన్స్ వ్యాధి బారిన పడకుండా వుంటారు.
ప్రముఖ పరిశోధకులు 1,84,024 మందిపై కాఫీ ప్రభావం ఎలా వుండో టెస్ట్ చేశారు. వీరంతా దాదాపు 13 ఏళ్ల వయసుకు అటుఇటుగా వున్నారు. వీరందరినీ పరీక్షిస్తే అందరికీ పార్కిన్సాన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు అధికారికంగా లెక్కలు బయటపడ్డాయ్. కాఫీలో వుండే కెఫిన్, పారాక్సంథైన్, థియోఫిల్లైన్ పార్కిన్సాన్ వ్యాధి రాకుండా పనిచేస్తుందంటున్నారు.
కాఫీ పార్కిన్సాన్స్‌కు విరుగుడు పానియమని అప్పటిదప్పుడు తేల్చిన పరిశోధన కాదు. దీని వెనక 20 సంవత్సరాల కృషి వుందని పరిశోధకులు అంటున్నారు. పార్కిన్సాన్స్ వ్యాధి వచ్చిన తరువాత కాఫీ తాగితే ఆ వ్యాధి క్రమంగా తగ్గినట్లు కూడా పరిశోధనలో తేలింది.

పార్కిన్సాన్స్, కాఫీకి సంబంధించి ఇంకా చాలా పరిశోధనలే జరిగాయ్. కాఫీ తాగే 25 శాతం మందిలో 40 శాతం వరకు పార్కిన్సాన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయ్. మెదడును కాఫీలో వుండే పదార్ధాలు ఎంతో కొంత రక్షిస్తున్నాయని పరిశోధనలో కనుగ్గొన్నారు. మెదడులో వుండే డొపమైన్ హార్మోన్ శరీరానికి సంతృప్తిని, ఆనందాన్ని, స్పూర్తిని రగిలిస్తుంది. ఈ డోపమైన్ హార్మోన్‌ను కాఫీ మరింత పెంచుతుందని పరిశోధనలో తెలుసుకున్నారు. ఇలా మెదడుకు కూడా చాలా ఆరోగ్యాన్ని కాఫీ కలిగిస్తుంది.
పార్కిన్సాన్స్ వ్యాధి గురించి
మెదడులో డోపమైన్‌ను ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోవడం వల్ల ఈ పార్కిన్సాన్స్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి గురైనప్పుడు చేతివేళ్లు వణకడం ప్రారంభమౌతుంది. శరీరాన్ని కదిలించడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. శరీరాన్ని బ్యాలెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. మాటల్లో తడబాటు వుంటుంది. ఎప్పుడూ నిరాశలో వుంటారు. నిద్రపోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.
పార్కిన్సాన్స్ వ్యాధికి చికిత్స కూడా లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారి పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారిపోతూ వుంటుంది. రోగాన్ని పూర్తిగా నయం చేయడానికి చికిత్స లేకున్నా పార్కిన్సాన్స్ వ్యాధి లక్షణాలను మాత్రం తగ్గించవచ్చు. మెదడులో డోపమైన్ స్థాయిని మందుల సాయంతో పెంచుతూ ఈ చికిత్సను నయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
కాఫీని రోజూ ఎంత తాగాలి
కాఫీ ఆరోగ్యానికి ప్రమాదం కాదు. కానీ రోజుకు రెండు కంటే ఎక్కువ కాఫీలు తాగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఉదయం ఒక కాఫీ, సాయంత్రం ఒక కాఫీ తీసుకోవాలి. కాఫీ తాగడం వల్ల పార్కిన్సాన్స్ వ్యాధి రాకుండా వుండడమే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా అడ్డుకుంటాయని చెబుతున్నారు. టీ తాగడం, పొగతాగడం అలవాటు వున్న వారు వాటికి బదులుగా కాఫీని ప్రతి రోజు తాగలి. వారి శరీరంలో వచ్చే మార్పులను కొన్ని రోజుల్లోనే వారు గుర్తించడం చూస్తాం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications