Latest Updates
-
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.!
యూరిక్ యాసిడ్ సమస్యకు ఈ ఆకు అసలైన సంజీవని
తమలపాకు అంటే కేవలం కిల్లీలోనో లేదా తాంబులంలోకి పనికొచ్చేది అనుకుంటే పొరబడినట్లే. ఈ ఆకును కలియుగ సంజీవనిగా చెప్పవచ్చు. ఆయుర్వేదంతో పాటు సంప్రదాయ వైద్యంలో కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. తమలపాకు అందించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, డీటాక్సిఫైయింగ్ లక్షణాలు కలిగి ఉండి మన శరీరం నుంచి విషపూరిత పదార్థాలను ఇది తొలగిస్తుంది. కిడ్నీలను క్లీాన్ చేస్తుంది. అయితే తమలపాకు అందించే మరో అతిపెద్ద న్రయోజనం ఏంటంటే.. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేటోళ్లకు పెద్ద ఉపశమనాన్ని అందిస్తుంది.
చాలా పెద్ద పెద్ద రోగాలకు మన వంటింట్లో ఉండే చిన్న చిన్న పదార్థాలే మెడిసిన్స్ గా ఉపయోగపడతాయి. నెలల తరబడి తీసుకునే ట్యాబ్లెట్లు కూడా నయం చేయని వ్యాధులను వంటింటి చిట్కాలతో తగ్గించవచ్చు. ప్రస్తుతం ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయిన యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో,నియంత్రించడంలో తమలపాకు అద్భుతంగా పనిచేస్తుంది. మనం తినే ఆహారం, తాగే డ్రింక్స్ లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిణాయం సాధారణం కంటే ఎక్కువ ఉంటే అది కీళ్లలో పేరుకుపోయి వాపు, నొప్పి, నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరుచుగా మూత్రవిసర్జన, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నడుము కింద, పొట్ట దిగువ భాగం, గజ్జల్లో నొప్పి వస్తుంది. దీని ఎఫెక్ట్ మెయిన్ గా మోకాలు,చీలమండులు,పాదాల్లో కనబడుతుంది. ఈ పరిస్థితిని హపర్ యూరిసెమియా అని పిలుస్తారు..ఇది ఆర్థరైటిస్ సమస్యలుగా మారే ఛాన్స్ ఉంది. అయితే యూరిక్ యాసిడ్ ని తగ్గించడంలో లేదా కంట్రోల్ చేయడంలో తమలపాకు ఎలా ఉపయోగపడుతుందో,దానిని ఎలా వాడాలో ఇక్కడ చూడండి.
తమలపాకు కషాయం..యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్
ఫ్రెష్ తమలపాకు 3 తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు మరిగించి తమలపాకును అందులో వేసి నీరు సగం 2అయ్యాక స్టవ్ ఆపేసి ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. దీనిని పొద్దునే లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటది.
తమలపాకు రసం కూడా
తమలపాకుని డిగి మిక్పీ జార్ లో వేసి గ్రైండ్ చేసి రసం తీసి దానిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. రోజుకొకసారి ఇది తీసుకుంటే చాలు. ఈ రసం, కషాయాలు మనవళ్లు కాదు అనుకుంటే రోజుకి 1-2 నమలడం కూడా చేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications