Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Summer health tips: సమ్మర్ లో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏంటీ?.సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలి?
సమ్మర్ వచ్చిందంటే చాలు సూర్యరశ్మి మనల్ని పలకరిస్తుంది, విహారయాత్రలకు పిలుస్తుంది, ఆరుబయట ఆనందించాలనిపిస్తుంది. ప్రస్తుతం వాతావరణంలో పరిస్థితులల్లో మార్పుల కారణంగా ఎండాకాలం ప్రారంభం అవకముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో అయితే భానుడి భగభగలకు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అయితే సమ్మర్ లో చాలామంది తమ ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు ఫ్లాన్ చేసుకుంటుంటారు. కానీ ఈ వేసవి తనతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుంది.
సమ్మర్ లో విపరీతమైన వేడి,అధిక తేమ, లైఫ్ స్టైల్ లో మార్పులు మనల్ని కొన్ని ఆరోగ్య సమస్యలకు గురిచేస్తాయి. డీహైడ్రేషన్ నుండి ఫుడ్ పాయిజన్ వరకు వేసవిలో మనం జాగ్రత్తగా లేకపోతే మన ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ సీజన్ ని కూడా ఆస్వాదించవచ్చు. వేసవిలో ప్రజలు ఎదుర్కొనే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు,వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం.

డీహైడ్రేషన్
సమ్మర్ మెదలవగానే డీ హైడ్రేషన్ అనే పదం ఎక్కువగా వినపడుతుంటది. మీ శరీరంలో తగినంత నీరు లేకపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. వేడి వాతావరణం కారణంగా శరీరం ఎక్కువగా చెమట పడుతుంది..దీంతో నీరు, ముఖ్యమైన మినరల్స్ ని శరీరం కోల్పోతుంది. ఈ ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే డీహైడ్రేషన్ వస్తుంది. అంటే తలతిరగడం, తలనొప్పి, అలసట, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. దాహం వేయకపోయినా కూడా రోజంతా తగినంత నీరు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కెఫిన్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. ఎండాకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
హీట్‌స్ట్రోక్
ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల హీట్ ఎగ్జాషన్ వస్తుంది, దీంతో తలతిరగడం, వికారం, అధిక చెమట పట్టడం వంటి సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది హీట్‌స్ట్రోక్‌గా మారవచ్చు..ఇది ప్రాణాంతక పరిస్థితి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం మంచిది. టోపీ, సన్ గ్లాసెస్, లేత రంగు దుస్తులు ధరించాలి. విపరీతమైన వేడిలో బాగా వెంటిలేషన్ ఉన్న లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాల్లో ఉండాలి. ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవడం వల్ల శరీరానికి కోల్పోయిన ఖనిజాలు తిరిగి అందుతాయి.
చర్మ సమస్యలు
ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికావడం, అధిక చెమట వల్ల చర్మంపై దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వేడి కారణంగా చెమట గ్రంథులు మూసుకుపోవడం వల్ల హీట్ రాష్ వస్తుంది.. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతింటుంది. బయటకు వెళ్ళే ముందు ఎల్లప్పుడూ SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి. చెమట పేరుకుపోకుండా ఉండటానికి తేలికైన,కాటన్ దుస్తులు ధరించాలి. చల్లటి నీటితో స్నానం చేయడం, చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. సన్‌బర్న్ అయినట్లయితే కలబంద జెల్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు
డీహైడ్రేషన్,అధిక చెమట వల్ల మూత్రం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మూత్ర నాళంలో బ్యాక్టీరియా సాంద్రత పెరుగుతుంది. ఇది UTIలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మహిళల్లో. ఎక్కువ ద్రవాలు తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. పరిశుభ్రత పాటించాలి,ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్‌లు ఉపయోగించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు. వదులుగా ఉండే కాటన్ లోదుస్తులు ధరించడం వల్ల ఆ ప్రాంతం పొడిగా ఉంటుంది,బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.
ఫుడ్ పాయిజన్
వేడి పెరగడం వల్ల ఆహారంలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల ఆహార సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కలుషితమైన లేదా పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వస్తాయి. ఎల్లప్పుడూ తాజాగా వండిన ఆహారాన్ని తినాలి. విపరీతమైన వేడి సమయంలో స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి. మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి, ఒక రోజులో తినేయాలి. పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి. ఫిల్టర్ చేయని నీటిని తాగకూడదు,ఆహార పరిశుభ్రతను పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications