Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
కండోమ్ వాడుతున్నారా? మీరు ఇలా చేస్తుంటే వెంటనే ఆపండి..లేకుంటే అస్సామే
పెళ్లి కాని జంటలే కాదు పెళ్లి అయినవాళ్లు కూడా పిల్లలు అప్పుడే వద్దు అనుకుంటే శృంగార సమయంలో ఖచ్చితంగా కండోమ్(condom) వాడతారు. అవాంఛిత గర్భం,ఇన్ఫెక్షన్, లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడంలో కండోమ్‌ల వాడకం చాలా సహాయపడుతుంది. అయితే కండోమ్ వాడేవాళ్లు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే పెద్ద ప్రమాదంలో పడటం మాత్రం గ్యారెంటీ.
కండోమ్ వాడే సమయంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల అవాంఛిత గర్భంతో పాటు కొన్ని వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే కండోమ్ ఉపయోగించే సమయంలో చాలామంది పురుషులు సాధారణంగా చేసే పొరపాట్లు(common condom mistakes) ఏంటో ఇక్కడ చూడండి.

కండోమ్ వాడే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
-ఫస్ట్ అసలు కండోమ్ ని కొన్నప్పడే దాని ఎక్స్ పైరీ డేట్ చూడటం చాల ముఖ్యం. చాలామంది అసలు దీనిని పట్టించకోరు. కండోమ్ లకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన కండోమ్ వాడితే లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భం గ్యారెంటీ.
-మరో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ప్యాకెట్ లోపల ఉంటే కండోమ్ పాడయ్యే అవకాశం లేదని చాలా మంది అనుకుంటారు. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. చెక్ చేయకుండా కండోమ్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. దీన్ని ఉపయోగించే ముందు పూర్తిగా చెక్ చేయండి.
- చాలామంది పళ్లు, గోర్లు లేదా కత్తెరతో కండోమ్ ప్యాకెట్‌ని తెరుస్తుంటారు. ప్యాకెట్‌ని తెరిచేటప్పుడు కండోమ్‌లు చాలాసార్లు పాడైపోతాయి ఇది మీకు సమస్యగా మారవచ్చు. సాధారణంగా కండోమ్‌ను తెరిచిన వెంటనే దాన్ని చెక్ చేయకుండా ఉపయోగిస్తారు. కండోమ్ ప్యాకెట్‌ను పళ్ళతో తెరవడం ప్రమాదకరం. కండోమ్ ప్యాకెట్‌ను చేతితో తెరవడానికి ప్రయత్నించండి. తద్వారా కండోమ్ పాడవకుండా ఉంటుంది.
-చాలా మంది పురుషులు సెక్స్ ప్రారంభంలో కండోమ్ ధరించరు..మధ్యలో కండోమ్ ధరిస్తారు. ఇలా చేయడం వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి యాక్టివిటీ మధ్యలో ఎప్పుడూ కండోమ్‌ని ధరించకండి. యాక్టివిటీ ప్రారంభంలోనే దాన్ని ఉపయోగించండి.
-చాలా మంది తమ పర్సులో కండోమ్‌లను ఉంచుకుంటారు. నిజానికి జేబులో లేదా పర్సులో కండోమ్ ఉంచుకుంటే అది అరిగిపోయి పాడైపోతుంది. అందువల్ల మీ పర్సులో లేదా జేబులో ఎప్పుడూ కండోమ్ ఉంచుకోకండి.
-కండోమ్‌ను చాలా వేడి లేదా చల్లని ప్రదేశంలో ఉంచవద్దు. ఇది దాని నాణ్యతను ప్రభావితం చేస్తుంది.. త్వరగా చెడిపోవడం ప్రారంభమవుతుంది. అందువల్ల కండోమ్‌ను ఎల్లప్పుడూ చాలా చల్లని లేదా వేడి ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో కాకుండా సాధారణ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో ఉంచాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











