Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రతీ తల్లీ ఖచ్చితంగా ఈ పరీక్షలను చేయించుకోవాలి..!
సాధారణ రక్త పరీక్షలు ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని నిర్ణయించడంలో సహాయపడుతుంది. తల్లికి ఈ సాధారణ పరీక్షలు తీసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే ఇది కొత్త తల్లుల విషయంలో తమకు మరియు వారి నవజాత శిశువులకు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
మాతృదినోత్సవం సందర్భంగా తల్లుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఖచ్ఛితంగా చేసుకోవాల్సిన పరీక్షల గురించి చెబుతున్నాము. ఈ పరీక్షలను ప్రతీ తల్లి తప్పకుండా చేసుకొని తీరాల్సిందే. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలు ఆరోగ్యంగా వుంటారు. కాబట్టి ఈ పరీక్షలను ప్రతీ తల్లి చేయించుకోవాలి.
షుగర్ టెస్ట్
రక్తంలో చెక్కరస్థాయి ఎంత ఉందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. ఈ పరీక్ష చేయించుకుంటేనే ఆరోగ్యం అసలు ఎలా ఉందనే విషయం మనకు బయట పడుతుంది. దీర్ఘకాలికంగా ఏ సమస్యలూ రాకుండా వుండాలంటే షుగర్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. రక్తంలో చెక్కర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దాన్ని నార్మల్ స్థాయిలో ఉండేలా జాగ్రత్త పడాలి.

వైటమిన్ డి
మహిళలు వయసు పెరుగుతున్న కొద్దీ రక్తంలో హెమోగ్లోబిన్ మాత్రమే కాదు వైటమిన్ డి లోపం కూడా ఉంటుంది. క్రమంగా ఇవి తగ్గిపోతుంటాయ్. ప్రసవం తరువాత వైటమిన్ డి ఉంటే డిప్రెషన్‌కు గురికాకుండా తల్లి వుంటుంది. లేదంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు గురౌతుంది. వైటమిన్ డితో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వైటమిన్ డి పరీక్షను ఖచ్చితంగా చేసుకోవాలి.
థైరాయిడ్ టెస్ట్
మనం మానసికంగా బలంగా ఉండాలంటే థైరాయిడ్ హార్మోన్లు నార్మల్ లెవెల్స్‌లో వుండాలి. థైరాయిడ్ పరీక్షను కూడా తప్పకుండా చేసుకోవాలి. కొందరి మహిళల్లో ఐయోడిన్ స్థాయి తగ్గిపోవడం వల్ల థైరాయిడ్ బారిన పడతారు. కాబట్టి ఈ పరీక్షణు ఖచ్చితంగా చేయించేకోవాల్సిందే.
లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్
లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ను కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. గుండెకు సంబంధించిన వ్యాధులు ఏవైనా వుంటే ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్టుల ద్వారా బయటపడుతుంది. శరీరంలో చెడుకొలెస్ట్రాల్ స్థాయి ఎంత వుందో కొలుస్తారు. దీని ద్వారా భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని తెలుసుకుంటారు.
సీబీసీ (రక్త కణాల పరీక్ష, కంప్లీట్ బ్లెడ్ కౌంట్)
రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎన్ని వున్నాయ్..? తెల్ల రక్త కణాలు ఎన్ని వున్నాయో ఈ సీబీసీ పరీక్ష ద్వారా తెలుసుకోగలుగుతాం. ఈ పరీక్షలు తల్లులు ఎప్పటికప్పుడు చేయించుకుంటే రక్తం ఆరోగ్యంగా వుందా లేక వాటికి సంబంధించిన చికిత్స ఏమైనా తీసుకోవాలో తెలుస్తుంది. ఈ పరీక్ష చేయించుకుంటేనే గర్భిణులకు ప్రసవం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
యూరిన్ టెస్ట్
ఈ పరీక్ష ద్వారా గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకోగలుగుతాం. యూరిన్‌లో ఏదైనా బ్యాక్టీరియా వుంటే కూడా మనకు తెలిసిపోతుంది. గర్భంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ముందుగానే గుర్తించడానికి వీలు కలుగుతుంది.
ఇవే కాకుండా గర్భిణులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరీక్షలు ఉన్నాయ్. ఎట్టి పరిస్థితుల్లో ఆ పరీక్షలను మిస్ కావద్దు. జన్యుపరమైన లోపాలు ఏవి ఉన్నా కూడా ఆ పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. తల్లి ఆరోగ్యం కోసం పరీక్షలను చేయించుకోవడానికి వెనకాడవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications