Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Best Cooking Oil : వంటకు, ఆరోగ్యానికి ఉత్తమమైన 4 ఆయిల్స్ ఇవే!
ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఏ ఆయిల్ మంచిది, ఏ బ్రాండ్ ని నమ్మాలో తెలియక జనం తల పట్టుకుంటుంటారు. అయితే ఏ ఆయిల్ ఆరోగ్యానికి బెస్ట్ అనేది మీరు కూడా నిర్ణయించుకోలేకపోతున్నారా? ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్ నీత్ బాత్రా..వంటకు,ఆరోగ్యం కోసం తాను నమ్మ 4 బెస్ట్ నేచురల్ కుకింగ్ ఆయిల్స్ గురించి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన 4 బెస్ట్ కుకింగ్ ఆయిల్స్ ఏవో ఇక్కడ చూడండి.
కోకోనట్ ఆయిల్
కోకోనట్ ఆయిల్ అనేది ఒక పవర్ హౌస్ లాంటిది. ఇందులో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్(MCT)పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి,జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. ఇందులో లారిక్ ఆమ్లం కూడా ఉంటుది..ఇది హానికరమైన సూక్ష్మక్రిములతో పోరాడటానికి మనకు అండగా నిలుస్తుంది. కొబ్బరి నూనెను ఆహారంలోనే కాకుండా జుట్టుకు చర్మానికి కూడా వాడటం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

ఆవకాడో ఆయిల్
అవోకాడో ఆయిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుందని లవ్ నీత్ బాత్రా చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి మీ చర్మానికి, కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. ఒక మంచి మాయిశ్చరైజర్‌గా కూడా ఈ ఆయిల్ పనిచేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు కాబట్టి వంట చేయడానికి కూడా ఇది చాలా మంచిది. మీ ఆరోగ్యానికి, అందానికి అవకాడో నూనె ఒక గొప్ప వరం అనడంలో సందేహం అక్కర్లేదు.
స్వచ్ఛమైన A2 ఆవు నెయ్యి
సాధారణ ఆవు నెయ్యితో పోలిస్తే A2 ఆవు నెయ్యి తేలికగా జీర్ణమవుతుందట. ఎందుకంటే ఇందులో A1 బీటా-కేసిన్ ఉండదు, కేవలం A2 బీటా-కేసిన్ మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా ఈ నెయ్యిలో అదనపు శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయని చెబుతారు. అంటే మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ఒక అద్భుతమైన సహాయకారిగా ఉపయోగపడుతుందట. ఈ నెయ్యి.. హార్మోన్ల బ్యాలెన్స్ కు మద్దతునిస్తూ, మీ చర్మానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలను అందిస్తుంది.
ఆవ నూనె
ప్రతి భారతీయ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఆయిల్ ఆవ నూనె అని ఆమె గట్టిగా చెబుతున్నారు. ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వంట చేయడానికి,ఆరోగ్యానికి రెండింటికీ దీనిని ఒక ప్రత్యేకమైన ఆయిల్ గా మారుస్తాయి. దీన్ని మీ ఆహారంలో ఉపయోగించడమే కాకుండా మీ చర్మం, జుట్టుకు కూడా రాసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
