Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఎర్రటి ఎండలో చల్లగా ఉండేందుకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? విషంతో సమానం.. జాగ్రత్త!
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చల్ల చల్లని కూల్ డ్రింక్స్ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్తున్నా రోడ్లపై వాహనాలు నిలుపుకొని మరీ గటగటా తాగేస్తుంటారు. ఇక మన ఇంటికి ఎవరైనా వచ్చినా, మనం ఎవరి ఇంటికైనా వెళ్లినా కూల్ డ్రింక్స్ ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది.
అయితే మండిపోయే ఎండల్లో ఈ కూల్ డ్రింక్స్ తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీ ఆరోగ్యం పాడవుతుంది:
కార్బోనేటెడ్ డ్రింక్స్ ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయని గోద్రెజ్ మెమోరియల్ హాస్పిటల్ లోని కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ అద్రితా బెనర్దీ తెలిపారు. ఇది కిడ్నీ కాల్షియంను దెబ్బతీస్తుందన్నారు. ఇందులో అధిక కార్బన్ డయాక్సైడ్ ఉంటుందని, ఇది దంత క్షయం ప్రమాదాన్ని పెంచుతుందన్నారు.
అధిక చక్కెర స్థాయిలు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు కారణం కావచ్చని చెప్పారు. పానీయాల్లో అధిక సోడియం రక్తపోటును మరింత పెంచుతుందన్నారు. గుండెపై దీర్ఘకాళిక ప్రభావాలను కల్గి ఉంటుందని వివరించారు.
కూల్ డ్రింక్స్‌లో కేలరీలు అధికం:
కార్బోనేటెడ్ పానీయాల్లో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ పానీయాల రెగ్యులర్ వినియోగం బరువు పెరగడానికి, ఊబకాయం యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్ని కార్బోనేటెడ్ పానీయల్లో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాల్షియాన్ని గ్రహించే శరీర సామర్థ్యానికి ఆటంకం కల్గిస్తుంది.. కాలక్రమేణా ఇది ఎముకలను బలహీన పరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు దారి తీస్తుంది.
దంత సమస్యలు వస్తాయి:
కార్బోనేటెడ్ పానీయాలు దంతాల ఎనామిల్ ను క్షీణింపజేస్తాయి. ఇది దంత క్షయానికి దారి తీస్తుంది. ఈ పానీయాల్లో యాసిడ్, చక్కెర కలయిక దంత ప్రమాదాన్ని పెంచుతుంది.
డీహైడ్రేషన్ కు గురవుతాం:
ఈ పానీయాల్లో దాహం తీర్చే లక్షణాలు ఉన్నప్పటికీ కార్బోనేటెడ్ పానీయాలు నిజానికి నిర్జలీకరణాన్ని పెంచుతాయి.
గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు:
పానీయాల్లో ఉండే కార్బోనేషన్ వల్ల కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం కల్గుతాయి. చాలా చక్కెర బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బ తీస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications