Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్
చాలామంది ఆస్తమా రోగులు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్య..నేను ఇన్ హేలర్ కరెక్ట్ గానే వాడుతున్నాను కదా, అయినా ఈ మధ్య దగ్గు, ఆయాసం ఎందుకు అదుపులోకి రావట్లేదు? అని మదనపడటం. గతంలో బాగానే పనిచేసిన మందులు అకస్మాత్తుగా ఎందుకు పనిచేయవు? ఈ ప్రశ్నకు, ఆస్తమా అదుపుతప్పడానికి గల అసలు కారణాన్ని విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ (లంగ్ డాక్టర్) డాక్టర్ గుత్తా లోకేష్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియోలో తెలిపారు.

ఆస్తమాను పెంచే ఆ బూజు ఏంటి?
డాక్టర్ లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో ఆస్తమాతో బాధపడుతున్న వారిలో దాదాపు 30 శాతం మంది రోగుల్లో సమస్య అదుపులోకి రాకపోవడానికి ప్రధాన కారణం యాస్పర్ గిల్లస్(Aspergillus) అనే ఫంగస్. దీన్నే వాడుక భాషలో మనం బూజు అని చెప్పవచ్చు. సాధారణంగానే ఆస్తమా రోగుల శ్వాసకోశ నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. మన చుట్టూ గాలిలో ఉండే ఈ యాస్పర్ గిల్లస్ ఫంగస్ ను వారు శ్వాస ద్వారా పీల్చుకున్నప్పుడు, అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి అక్కడ స్థావరం ఏర్పరుచుకుంటుంది.
100 రెట్లు పెరిగే ఆస్తమా తీవ్రత
ఊపిరితిత్తుల్లోకి చేరిన ఈ బూజు (ఫంగస్) తీవ్రమైన ఎలర్జీని ట్రిగ్గర్ చేస్తుంది. దీని ఫలితంగా ఆస్తమా తీవ్రత ఏకంగా 100 రెట్లు పెరుగుతుందని డాక్టర్ లోకేష్ హెచ్చరించారు. ఊపిరితిత్తుల లోపల ఈ బూజు పేరుకుపోవడం వల్ల, అప్పటివరకు బాగానే పనిచేసిన ఇన్ హేలర్లు కూడా పనిచేయడం మానేస్తాయి. విపరీతమైన దగ్గు, భరించలేని ఆయాసం వస్తుంటాయి. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే లంగ్స్ చుట్టూ ఈ ఫంగస్ చేరిపోయి, ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఈ సమస్యను ఎలా గుర్తించాలి?
గతంలో ఇన్ హేలర్లతో అదుపులో ఉన్న ఆస్తమా.. ఇప్పుడు కంట్రోల్ తప్పుతున్నట్లు అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే నిపుణులైన డాక్టర్ ను సంప్రదించి బేసిక్ బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి.
ఐజీఈ (IgE) లెవల్స్.. రక్తంలో టోటల్ ఐజీఈ లెవల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. ఈ లెవల్స్ 500 దాటినా అప్రమత్తం కావాలి.
యాస్పర్ గిల్లస్ టెస్ట్: యాస్పర్ గిల్లస్ ఫంగస్ కోసం చేసే ప్రత్యేక బ్లడ్ టెస్టుల్లో రిపోర్టు పాజిటివ్ అని వస్తే ప్రమాదం ఉన్నట్లేనని డాక్టర్ లోకేష్ తెలిపారు.
సీటీ స్కాన్ (CT Scan): ఛాతీకి సీటీ స్కాన్ చేసినప్పుడు అందులో ఏబీపీఏ (ABPA - Allergic Bronchopulmonary Aspergillosis) అనే లక్షణాలు మ్యాచ్ అయితే.. మీ ఆస్తమా తీవ్రతకు కారణం ఈ ఫంగస్సే అని కచ్చితంగా నిర్ధారించుకోవచ్చన్నారు.
పరిష్కారం ఇదే
ఈ సమస్యను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో గుర్తిస్తే నయం చేయవచ్చని డాక్టర్ గుత్తా లోకేష్ భరోసా ఇచ్చారు. పరీక్షల్లో ఫంగస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, వైద్యుల పర్యవేక్షణలో యాంటీ ఫంగల్ మందులను 3 నుంచి 4 నెలల పాటు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా శరీరంలోని ఫంగస్ ను పూర్తిగా బయటకు పారద్రోలవచ్చు. ఈ ఫంగస్ తొలగిపోగానే ఆస్తమా మళ్లీ మీ కంట్రోల్ లోకి వచ్చేస్తుందని ఆయన వివరించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
