Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గుండె సమస్యలు ఎక్కువగా పురుషులకే... లాన్సెట్ తాజా పరిశోధన..?
ప్రముఖ లాన్సెట్ పరిశోధకులు ఆశ్చర్యం గొలిపే విషయాన్ని తెలిపారు. కరోనా వ్యాధి వల్ల, గుండె జబ్బుల వల్ల ఎక్కువగా మరిణించేది పురుషులేనని అంటున్నారు. ఈ వ్యాధులు సోకి మరణించిన మహిళలు, పురుషులతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేలింది. ప్రస్తుుతం ఈ సర్వే వైద్య విభాగాల్లో ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఆరోగ్య సమస్యలపై ఇప్పటివరకు వచ్చిన చాలా సర్వేల్లో పురుషులే ఎక్కువ అనారోగ్యానికి గురౌతున్నట్టు తేలింది. ఆత్మహత్యల్లో కూడా పురుషులే ఎక్కువ మంది ఉంటున్నారు. కుటుంబ భారాన్ని ఎక్కువగా మోసే పురుషులు సహజంగా ఈ వ్యాధులకు ఎక్కువ గురౌతున్నారు. ఏదైనా తినే స్వేచ్ఛ, ఎలాగైనా బ్రతికే స్వేచ్ఛ కూడా పురుషులకు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి వ్యాధులకు దారి తీస్తోంది. లాన్సెట్ పరిశోధకులు తాజాగా జరిపిన సర్వే గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
2021వ సంవత్సరం జరిపిన లెక్కల ప్రకారం, వివిధ వ్యాధులు, కరోనా, రోడ్డు ప్రమాదాల్లో అసహజంగా మరణించిన 20 మందిలో 13 మంది పురుషులే ఉన్నట్లు కనుగ్గొన్నారు. అయితే మహిళలు మాత్రం మానసిక సమస్యలు, తలనొప్పి, మైగ్రేన్ లాంటి ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు బయటపడింది. మహిళల్లో ఈ వ్యాధులు ప్రాణాంతకం కానప్పటికీ వారే ఎక్కువగా వీటికి గురౌతున్నట్లు తేలింది.
కోవిడ్ మరణాల్లో మహిళల కంటే పురుషులు 45 శాతం ఎక్కువ సంఖ్యలో మరిణించినట్లు తేలింది. గుండెకు సంబంధించిన వ్యాధుల విషయంలో కూడా మహిళల కంటే పురుషుల్లో 45 శాతం ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్ వెలువడింది.

పురుషుల్లో కోమార్బిడిటీ..
కోమార్బోడిటీ అంటే ఒకటి కన్నా ఎక్కువ అనారోగ్యాలకు ఒకే సారి గురికావడం. ఈ కోమార్బిడిటీ కూడా మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉన్నట్లు కనుగ్గొన్నారు. పురుషుల్లో స్మోకింగ్, మద్యం తాగే అలవాటు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కోమార్బిడిటీ సమస్యలు పెరిగిపోతున్నాయ్. ఒకే వ్యాక్తిలో గుండె సమస్య, రక్తపోటు, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రెండు మూడు రోగాలను ఒకే సారి ఎదుర్కొంటున్న పురుషులు చాలా మంది వున్నారు. కోమార్బిడిటీ సమస్య ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుంది.
మహిళల ఆరోగ్యం, మానసిక సమస్యలు
పురుషులు, మహిళల ఆరోగ్యం సమస్యలు కొంత భిన్నంగా వుంటున్నాయ్. మహిళల్లో ఎక్కువగా వెన్నుముక సమస్య, డిప్రెషన్, తలనొప్పి, యాంక్జైటీకి ఎక్కువగా గురౌతున్నారు. డిమెన్షియా, ఆల్జీమర్, హెచ్‌ఐవీ ఏయిడ్స్ లాంటి వ్యాధులకు కూడా ఎక్కువగా గురౌతున్నారు.
మానసిక సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్యలు గమనిస్తే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. లాన్సెట్ అధికారిక లెక్కల ప్రకారం 2021 సంవత్సరానికి గాను ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలతో రోజుకు పురుషులు 671 మంది మరణిస్తే, మహిళలు 1019 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ లెక్కలు మహిళల్లో మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది.
అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిందే
పురుషులు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే తప్పకుండా జీవనవిధానంలో మార్పు రావలసిందే. స్టైల్ కోసమో, మగవాడు అని తెలపడం కోసమో సిగరెట్, మందు తాగేవారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటివి గనక తగ్గించుకోకపోతే వారి ప్రాణాలకే పెను ముప్పుగా మారే అవకాశం వుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications