Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
వర్షాకాలంలో పాదాల సంరక్షణ మగవారి కంటే ఎక్కువగా ఆడవారికి సవాల్‌గా మారుతుంది. ఎక్కువగా తేమకి గురికావడం, తడి బూట్లు, బురద, చెమట వీటి కారణంగా పాదాలపై మురికి పేరుకుపోయి పగుళ్లకి దారితీస్తుంది. అందుకే ఈ కాలంలో ఫుట్ కేర్ కోసం ఎక్కువగా బ్యూటీ పార్లర్‌ను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో పార్లర్‌కి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే సులభంగా ఈ పద్ధతిని ఫాలో అయినట్లయితే మీ పాదాలు ఆరోగ్యకరంగా మెరుస్తాయి. ఆ విధానమే పెడిక్యూర్.. పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

పాదాల సంరక్షణలో పెడిక్యూర్ తప్పనిసరి. అయితే పార్లర్‌కి వెళ్తే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. దానికి బదులుగా వారానికి రెండు సార్లు ఇంట్లోనే సులభంగా ఇలా పెడిక్యూర్ చేసుకున్నట్లయితే మీ పాదాలు మృదువుగా, శుభ్రంగా అవుతాయి. గోరువెచ్చని నీరు, తేలికపాటి సబ్బు, క్లెన్సర్, ఫుట్ స్క్రబ్, మాయిశ్చరైజర్ చాలు. పెడిక్యూర్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
పాదాలను శుభ్రం చేయండి..
ముందుగా టబ్‌లో గోరువెచ్చని నీటిని పోసి అందులో తేలికపాటి సబ్బు లేదా ఫుట్ క్లెన్సర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు పాదాలను అందులో పెట్టి సుమారు 10 నిమిషాల పాటు ఉంచండి. దీని ద్వారా పాదాలపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యకరంగా చేస్తుంది.

సున్నితంగా రుద్దాలి
పది నిమిషాల తర్వాత ఫుట్ స్క్రబ్‌ను తీసుకుని మడమలు, పాదాలను సున్నితంగా మసాజ్ చేసుకోండి. గట్టిగా రుద్దితే చర్మంపై చికాకు, గాయాలు ఏర్పడే అవకాశం ఉంది. సున్నితంగా ఉన్న పగిలిన చర్మంపై స్క్రబింగ్ చేయకండి.

నెయిల్ కేరింగ్
ఇప్పుడు కాలి గోళ్లను శుభ్రం చేసి మీకు కావాల్సిన విధంగా నెయిల్ కట్టర్‌తో కట్ చేసుకోండి. లోతుగా కత్తిరించకండి. లేదంటే రక్తస్రావం లేదా సున్నితత్వం దెబ్బతింటుంది. కత్తిరించిన తర్వాత గోరు అంచులను అరగదీయండి. దీని ద్వారా గోర్లు సాఫ్ట్‌గా ఉంటాయి.

పాదాలను ఆరబెట్టుకోండి
తర్వాత శుభ్రమైన క్లాత్ లేదా టవల్‌తో పాదాలను, కాలి వేళ్ల మధ్య ప్రదేశాలను తుడిచి ఆరబెట్టుకోండి. ఆ ప్రాంతాల్లో తేమ లేకుండా చూసుకోండి. లేదంటే బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉంది.

మాయిశ్చరైజర్ రాసుకోండి
ఇప్పుడు పాదాలకు మాయిశ్చరైజర్ లేదా ఫుట్ క్రీమ్ అప్లై చేసుకోండి. మడమలు పొడిగా ఉన్నట్లయితే రాత్రిపూట క్రీమ్ రాసి కాటన్ సాక్స్ ధరించి పడుకున్నట్లయితే తేమ కోల్పోకుండా ఆరోగ్యకరంగా ఉంటాయి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా పాదాల సంరక్షణ మెరుగ్గా ఉంటుంది. అయితే పెడిక్యూర్ చేసినా చేయకపోయినా కొన్ని విషయాలు మాత్రం గుర్తుంచుకోవాలి. తడి సాక్సులు, బూట్లును ఎక్కువసేపు ధరించకండి. శుభ్రమైన, పొడి సాక్సులు ధరించండి. బహిరంగ ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకండి. దురద, ఎర్రబడటం, నొప్పి, వాపు, స్కిన్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లయితే చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
