Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఐస్ క్రీమ్ తింటున్నారా?..వెంటనే ఈ టెస్ట్ చేయించుకోండి!
మీకు తరచుగా ఐస్ నమలాలనిపిస్తుందా? లేదా చల్లటి నీరు,ఐస్ క్రీమ్ వంటి వాటిపై మనసు లాగేస్తుందా? చాలామంది దీనిని ఒక సాధారణ అలవాటుగా కొట్టిపారేస్తారు. కానీ ఇది మీ శరీరం ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. ఈ అలవాటును వదిలించుకోలేకపోతుంటే.. అది కేవలం కోరిక కాదు, మీ ఆరోగ్యంలో ఏదో లోపించిందనడానికి ఒక బలమైన సూచన. అదే ఐరన్ లోపం.
ఐస్ కోరికకు, ఐరన్ లోపానికి సంబంధమేంటి?
వైద్య పరిభాషలో ఈ వింత అలవాటును అంటారు. ఈ స్థితిలో ఉన్నవారు సుద్ద, మట్టి లేదా ఐస్ వంటి పోషకాలు లేని పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. శరీరంలో ఐరన్ లోపించినప్పుడు ముఖ్యంగా రక్తహీనత సమస్య మొదలైనప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది. మన శరీరంలో ఆక్సిజన్‌ను రవాణా చేసే హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోయినప్పుడు మెదడు పోషకాలు లేని వస్తువుల వైపు మనల్ని ప్రేరేపిస్తుంది. ఐస్ నమలాలనే తీవ్రమైన కోరిక అందులో భాగమే. దీనిని విస్మరించడం అంటే రక్తహీనతను తీవ్రతరం చేయడమే.

నిజ నిర్ధారణ ఎలా?
ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం చాలా సులభం. సాధారణ రక్తపరీక్షలైన సీబీసీ (CBC), సీరం ఫెర్రిటిన్, టీఐబీసీ (TIBC) పరీక్షల ద్వారా మీ శరీరంలోని ఐరన్ నిల్వలను కచ్చితంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లోపాన్ని ఎలా అధిగమించాలి?
లోపం తీవ్రంగా ఉంటే డాక్టర్ల సలహాతో మందులు వాడాల్సి ఉంటుంది. అదే తేలికపాటి లోపమైతే వంటింటి చిట్కాలతోనే దీనిని సులభంగా అధిగమించవచ్చు. ఐరన్ లోపాన్ని జయించాలంటే కేవలం ఐరన్ అధికంగా ఉండే ఆహారం తింటే సరిపోదు. తిన్న ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించుకోవాలంటే విటమిన్ సి అత్యవసరం. అలాగే కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి.
ఐరన్ ను పెంచే అద్భుతమైన ఆహారాలు
-రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే ఆ నీటితో సహా ఖాళీ కడుపుతో తీసుకోండి.
-ఖర్జూరం, నువ్వులను పాలతో కలిపి లేదా లడ్డూల రూపంలో తినండి.
-పాలకూర, బీట్ రూట్, దానిమ్మ రసాలు అద్భుతంగా పనిచేస్తాయి.
-బెల్లం, చింతపండు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోండి.
-అన్ని రకాల పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications