Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కీర దోస vs పుచ్చకాయ: ఈ సమ్మర్ లో మీ శరీరాన్ని ఏది వేగంగా చల్లబరుస్తుంది?
రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాల కారణంగా ఎండలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కానీ అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈ మండే ఎండల్లో బయటకు వెళ్లారంటే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడటం గ్యారెంటీ. డీహైడ్రేషన్ అలసట, తలతిరగడం వంటి అనేక సమస్యలు ఈ సీజన్ లో చాలా కామన్. అయితే ఈ సమయంలో మన శరీరానికి చల్లదనాన్ని, తగినంత నీటి శాతాన్ని అందించడంలో పుచ్చకాయ, కీర దోసకాయ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని సమ్మర్ సూపర్ ఫుడ్స్ గా అభివర్ణిస్తుంటారు.
కీర దోసకాయలో నీరు పుష్కలంగా ఉంటది,పుచ్చకాయైతే నీటితో పాటు అనేక పోషకాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి కొందరు సమ్మర్ లో దోపకాయ కన్నా పుచ్చాకాయే ఆరోగ్యానికి మంచిదని..ఇంకొందరు పుచ్చకాయ తియ్యగా ఉంటుందని, దానివల్ల బరువు పెరుగే అవకశముంది కాబట్టి దోపకాయనే బెటర్ అరి అంటుంటారు. అసలు సమ్మర్ లో ఆరోగ్యారి్ి ఏది ఎక్కువ మేలు చేస్తుంది..దోసకాయ,పుచ్చకాయలో ఏది బెటరో ఇప్పుడు చూద్దాం.

దోసకాయ vs పుచ్చకాయ-ఇదే బెస్ట్
దోసకాయలో దాదాపు 96% నీరే ఉంటుంది. కేలరీలు చాలా తక్కువ. ఫైబర్, విటమిన్ K, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది తినడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. శరీరానికి చల్లదనాన్ని అందించి, వేడిని సమతుల్యం చేస్తుంది. చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి, టానింగ్, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీని రసాన్ని ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. దీంతో పాటు లైకోపీన్, విటమిన్ సి, విటమిన్ ఏ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా, చర్మానికి తేమను అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలోని సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని కాపాడటమే కాకుండా, జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది.
నిపుణులు ఏమంటున్నారు?
బరువు తగ్గాలనుకునేవారికి దోసకాయ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు తెలిపారు. ఇది తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. పుచ్చకాయ కూడా ఆరోగ్యకరమైనదే అయినా ఇందులో ఉండే సహజ చక్కెరల వల్ల అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో రెండూ సమర్థవంతమైనవే అయినా పుచ్చకాయ తక్షణ శక్తిని, నీటిని ఏకకాలంలో అందించగలదు. ముఖ్యంగా ఎండలోంచి అలసిపోయి వచ్చినప్పుడు చల్లటి పుచ్చకాయ ముక్కలు తింటే కలిగే ఉపశమనం అంతా ఇంతా కాదు.
దోసకాయను రోజంతా అప్పుడప్పుడు స్నాక్ గా తీసుకోవడం మంచిది. దోసకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపును శుభ్రం చేసి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి దోసకాయ మరింత ప్రయోజనకరం. పుచ్చకాయ కూడా తేలికగా జీర్ణమైనప్పటికీ కొందరిలో అధికంగా తింటే గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు.
వేసవిలో దోసకాయ, పుచ్చకాయ రెండూ ప్రయోజనకరమైనవే. బరువు నియంత్రణలో ఉంచుకుంటూ రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండాలనుకునేవారికి దోసకాయ మంచిది. తక్షణ శక్తి, పోషకాలు, అదనపు హైడ్రేషన్ కోరుకునేవారికి పుచ్చకాయ బెస్ట్ ఆప్షన్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications