Latest Updates
-
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే!
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
వంటల్లో మంచి సువాసన కోసం కరివేపాకును వాడుతుంటాం. ఇక ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనబడే చెట్టు వేప చెట్టు. వేప పుల్ల దగ్గర నుంచి ఆకుల వరకు అన్నీ మనకు ఉపయోగపడేవే. వేప ఆకును దాని ఔషధ గుణాల కోసం ఉపయోగిస్తాం. అయితే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో ఈ రెండింటిలో ఏది ముందుంటుంది? ఏది ఎక్కువ మేలు చేస్తుంది?
కమ్మని వాసనతో పాటు ఆరోగ్యాన్నిచ్చే కరివేపాకు
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఏ, బి, సి, ఇ, బీటా కెరోటిన్, ఐరన్, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. మనం అన్నం తినేటప్పుడు కరివేపాకును పక్కన పెట్టేస్తుంటాం కానీ ఇది జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కురుల ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కరివేపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు.

చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి అమృతమే వేప ఆకు
చేదుగా ఉండేదే ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సామెత వేపకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో నింబిన్, అజాడిరాక్టిన్, క్వెర్సెటిన్ వంటి సుమారు 140కి పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి, మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. పూర్వకాలం నుండి చర్మ వ్యాధులకు, జ్వరాలు, ఇన్ఫెక్షన్లకు వేపను బెస్ట్ మెడిసిన్ గా వాడుతున్నారు. లేత వేప ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది, రోగనిరోధక శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది.

ఏ ఆకును ఎలా వాడాలి?
ఈ రెండు ఆకులూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే వీటిని ఎలా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనమో ఇక్కడ చూడండి.
కరివేపాకు: మీ రోజువారీ వంటల్లో 8 నుండి 12 తాజా కరివేపాకులను వాడటం అలవాటు చేసుకోండి. ఉదయాన్నే పరగడుపున 5-6 ఆకులను నమిలి తింటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీన్ని నీటిలో మరిగించి హెర్బల్ టీ లాగా కూడా తాగవచ్చు.
వేప ఆకులు: ఉదయం నిద్రలేవగానే పరగడుపున 4 నుండి 8 లేత వేప ఆకులను నమిలి తినొచ్చు. లేదా ఆకులను మిక్సీ పట్టి జ్యూస్ లాగా తీసుకున్నా రోగాలన్నీ పారిపోతాయి.
మీకు ప్రతిరోజూ పచ్చి ఆకులు అందుబాటులో ఉండవు అనుకుంటే.. కరివేపాకు, వేప ఆకులను విడివిడిగా ఎండబెట్టి లేదా దోరగా వేయించి పొడి చేసుకుని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని వంటల్లో, డ్రింక్స్ లో మీకు నచ్చినప్పుడు వాడేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
