Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రోజూ నూడుల్స్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..! పోషకాలు నిల్..!
నూడుల్స్ చూడ్డానికి మాత్రమే కాదు తినడానికి కూడా టేస్టీగా వుంటాయ్. ఇది చైనీయులు రోజూ తినే ఆహారం. మనకు అన్నం ఎలాగో చైనీయులకు నూడుల్స్ అలాగన్నమాట. అయితే నూడుల్స్ తినవద్దని బోధిస్తారు కానీ మరి చైనీయులు తింటారు కదా అని ఎదురు ప్రశ్నలు వేస్తారు. మనుషులందరమూ ఒకటే అయినా భూమిపై వారి తరతరాల సంస్కృతి, ఆహార అలవాట్లు భిన్నంగా వుంటాయ్. అయితే పరిశోధకులు మాత్రం నూడుల్స్‌కు దూరంగా వుండమని చెబుతున్నారు. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్టులు కూడా వస్తాయని అంటున్నారు.
పోషకాలు తక్కువగా వుంటాయ్
నూడుల్స్‌లో సోడియం కంటెంట్ చాలా ఎక్కువగా వుంటుందని అంటున్నారు. పోషకాలు కూడా చాలా తక్కువగా వుంటాయి. వైటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ ఏమాత్రం కూడా నూడుల్స్‌లో వుండవు. క్యాలరీలు కూడా చాలా ఎక్కువగా వుంటాయ్. రోజూ ఇన్స్‌టాంట్ నూడుల్స్ తినడం వల్ల పోషకలోపాలు కూడా ఎక్కువగా వుంటాయ్.
నూడుల్స్‌లో టేస్ట్ రావడానికి మోనోసోడియం గ్లూటమేట్‌ను ఉపయోగిస్తారు. అమెరికన్ డ్రాగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా గ్లూటమేట్ ద్వారా సైడ్ ఎఫెక్టులు వస్తాయని చెబుతున్నారు. దీని వల్ల తలనొప్పి తీవ్రంగా పెరగడం, బరువు పెరగడం, బ్లడ్ ప్రెజర్ కూడా ఎక్కువవడం జరుగుతుంది.

నూడుల్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా వుండడం ఆందోళన కలిగించే అంశం. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలు దెబ్బతినే అవకాశం వుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ చెబుతోంది. దీని వల్ల హైపర్‌టెన్షన్, గుండెపోటు కూడా పెరగే అవకాశం వుందంటున్నారు.
నూడుల్స్‌ను మైదపిండితో తయారు చేస్తారు. మైదపిండిలో ఫైబర్ తక్కువగా వుంటుందన్న విషయం తెలిసిందే. మైదాను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయి కూడా బాగా పెరుగుతుంది. డయాబెటీస్‌తో బాధపడేవారికి చాలా ప్రమాదకరమని కూడా చెబుతున్నారు.
రెగులర్‌గా నూడుల్స్‌ను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. రక్తపోటు కూడా చాలా ఎక్కువయ్యే ప్రమాదం వుందంటున్నారు. నడుము చుట్టు కడుపు చుట్టూ కొవ్వు పెరగి ప్రమాదం వుందంటున్నారు. అవసరం లేని చోట కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు.
ఇన్స్‌టాంట్ నూడుల్స్‌లో చెడు కొలెస్ట్రాల్ అధికంగా వుంటుంది. రోజూ నూడుల్స్ తినడం వల్ల గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకొనిపోయ్ హార్ట్ బ్లాకేజ్‌కు, గుండెపోటుకు కారణమవుతుంది.
నూడుల్స్ ఎక్కువ కాలం నిలువ వుండడానికి హానికరమైన కెమికల్స్‌ను ఉపయోగిస్తారు. టీబీహెచ్‌క్యూ (టెర్‌టరీ బటిల్ హైడ్రోక్వినోన్, (బీహెచ్ఏ) బటిలేటెడ్ హైడ్రోక్సియానిసోల్.
నూడుల్స్ ఎంత అనారోగ్యమైనప్పటికీ వాటిని కొంత ఆరోగ్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ నూడుల్స్ చేసుకోకుండా వాటిలో పోషకాలు మెండుగా వున్న కూరగాయ ముక్కలను వేసుకోవాలి. వీటి వల్ల ఫైబర్, వైటమిన్లు, పోషకాలు అందే అవకాశముంది.
నూడుల్స్‌లో కూరగాయలతో పాటు కొన్ని గుడ్లను, చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని వల్ల నూడుల్స్ తిన్నప్పుడు ప్రొటీన్లు కూడా బాగా అందే అవకాశముంది.
సాధ్యమైనంత వరకు నూడుల్స్‌ను ఆహారంలో భాగం కాకుండా చూడాలి. చైనీయులకు నూడుల్స్ ఎన్నో ఏళ్ల నుంచి అలవాటు. వారు చాలా రకాల జంతువులను తిని వాటి మాంసాన్ని అరిగించుకునే సామర్ద్యాన్ని కలిగివున్నారు. కాబట్టి నూడుల్స్ చైనీయులకు సెట్ అవుతుంది కానీ మనం తింటే అనారోగ్యానికి గురికావాల్సిందే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications