Latest Updates
-
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు
వాతావరణం మళ్లీ చల్లబడింది. పలు ప్రాంతాల్లో వరుణుడు చినుకులతో పలకరిస్తున్నాడు. ఈ చల్లదనం ఆహ్లాదకరంగా ఉన్నా.. మరోవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి. ఇక కొన్ని ఇళ్లలో గోడలపై తేమ, పాచి పేరుకుపోతుంది. దీని వల్ల పలు శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..

ఇప్పటికే మీరు, ఆస్తమా, అలర్జీ, పలు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో గాలిలో తేమ పెరుగుతుంది. తద్వారా ఇళ్లలో తడి ఏర్పడుతుంది. గోడలపై బూజు, పాచి పేరుకుపోవడం, నల్లగా మారడం, పసుపు పచ్చ మరకలు వంటివి ఏర్పడుతాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని, ఊపిరితిత్తుల వ్యాధులకి దారితీస్తుందని అంటున్నారు. అందుకే ఈ కాలంలో ఎక్కువగా ఆయాసం, విపరీతంగా దగ్గు, గురక, అలర్జీ వంటి కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఫంగస్
వర్షాకాలంలో వాతావరణంలో ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గాల్చి పీల్చేటప్పుడు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిలో వీటితో పోరాడే శక్తి ఉంటుంది. కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారిలో, ఇప్పటికే పల్మనరీ డిసీజ్‌లతో బాధపడుతున్న వారిలో ఫంగస్ ప్రభావం ఎక్కువగా ఉండి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
వీటిపైనే ఎక్కువ
వర్షాకాలంలో తేమ అధికంగా పెరుగుతున్న కారణంగా ఫంగస్, ఇతర క్రిమికీటకాలు విపరీతంగా పెరుగుతాయి. ఇక, తేమగా ఎక్కువగా ఉండే ఇళ్లలో, తడి గోడలపై, పాత బట్టలపై, పరుపులపై బూజు వ్యాప్తి చెందుతుంది. ఇది మనం గాలి పీల్చినప్పుడు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.

వీరిలో ప్రభావం ఎక్కువ
వర్షాకాలంలో ఫంగస్ కారణంగా అందరిలో కాకపోయినా కొన్ని రకాల వ్యక్తుల్లో వివిధ శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ఆస్తమా, పల్మనరీ డిసీజ్, బ్రాంకైటిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, అధిక మధుమేహం, క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగుల్లో ఈ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడుతున్న వారు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు తీసుకునే వ్యక్తులకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా ఉన్న కారణంగా వారిలో సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది.
ఎలా గుర్తించాలి.?
గోడల్లో తేమ కారణంగా వచ్చే ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి కొన్ని తీవ్ర లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభంలో దగ్గు, జలుబు సాధారణంగా అనిపించినా ఇది దీర్ఘకాలం కొనసాగితే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. తీవ్రమైన దగ్గు, ఆయాసం, ఛాతి బిగువుగా ఉండటం, గురక, జ్వరం, శ్లేష్మం అధికంగా ఉత్పత్తి కావడం, కొన్నిసార్లు దగ్గులో రక్తం పడటం వంటి లక్షణాలు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ మీకు అలర్జీ ఉన్నట్లయితే.. తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటివాటితో ఇబ్బందులకు గురికావచ్చు. ఆస్తమా ఉన్నవారు ఇన్‌హేలర్లు వాడుతున్నా.. ఈ లక్షణాలు తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు, శ్వాసకోశ, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకునేందుకు ఇల్లు, పరిసరాల విషయంలో కీలక జాగ్రత్తలు పాటించాలి. ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. నీటి లీకులు ఉంటే మరమ్మతులు చేసుకోవాలి. బాత్రూం, వంటగదిని రెగ్యులర్‌గా శుభ్రం చేసుకోవాలి. తడి బట్టలను ఎక్కువ సేపు ఇంట్లో ఉంచుకోకండి. ఇంట్లోకి గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి. డీహ్యూమిడిఫైయర్లు వాడటం మేలు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications