కర్నాటక, బెంగళూరులో డెంగ్యూ కేసులు రికార్డ్ బ్రేక్, డైటీషియన్ డాక్టర్ స్వాతి తో ప్రత్యేక ఇంటర్వ్యూ!లక్షణాలు

అనేక సమస్యలతో బాధపడుతున్న చాలా మంది రోగుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించి వారు పోషకాలు ఉన్న ఆహారం తీసుకుని వారు త్వరగా కోలుకోవడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ స్వాతి నర్శన మంచి డైటీషియన్ గా పేరు సంపాధించుకున్నారు. డైటీషియన్ లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవివారు. స్పోర్ట్స్, సైన్స్ అండ్ న్యూట్రిషన్‌ లో పీజీ చేసిన డాక్టర్ స్వాతికి సుమారు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడం, తక్కువ బరువు ఉన్నవారి బరువు పెంచడంలో, శరీరంలో శక్తిని పెంచడంతో పాటు వెల్ నెస్ లో డాక్టర్ స్వాతి నర్శకు అపారమైన అనుభవం ఉంది.

సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామంతో ఆరోగ్యంపై సమగ్ర విధానం గురించి వివరించడంలో ఆమెకు చాలా అనుభవం ఉంది. మనిషి శరీరాన్ని బట్టి వారు తీసుకునే ఆహారం గురించి, వాళ్లలోని పోషకాహార సమస్యలను అంచనా వేయడంలో డాక్టర్ స్వాతికి చాలా అనుభవం ఉంది. ప్రముఖ ఆసుపత్రులు, క్లీనిక్స్ లో పని చేసి రోగులు ఎలాంటి ఆహారం తీసుకుంటే వారు త్వరగా కొలుకుని ముందులాగా చాలా చలాకిగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్న డైటీషియన్ డా. స్వాతి ఇప్పటికే వేల మందికి అనేక సలహాలు ఇచ్చారు. త్వరగా ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి వీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం గురించి క్షుప్తంగా వివరిస్తున్నారు.

xclusive Interview With Dietician Swati Narshana

ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కడ చూసినా నీటి నిల్వలు కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వర్షం కారణంగా రోడ్లు నీటమునిగాయి, వాహనాలు నీట మునిగాయి, దోమల వల్ల డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కాబట్టి, దీన్ని అరికట్టాల్సి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి, డెంగ్యూ జ్వరంగాను ఎలా నివారించాలి దానికోసం తీసుకోవల్సి జాగ్రత్తలేంటో ఈ రోజు డైటీషియన్ డా. స్వాతి నర్శనతో ప్రత్యే ఇంటర్యూలో

1. డెంగ్యూ జ్వరం అంటే ఏమిటి?

డెంగ్యూ ( (Break bone fever) అనేది దోమల నుండి వ్యాపించే ఒక వైరల్ ఇన్ఫెక్షన్.

2. మీకు ఇది ఎలా వస్తుంది మరియు నాకు డెంగ్యూ ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఏమి చేయాలి?

ఇది సాధారణంగా ఉపఉష్ణమండల మరియు అత్యష్ణమండల అంటే తుఫాను , వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు కారణంగో వాతావరణంలో దోమలు పెరిగి దోమకాటుతో వ్యాధులను వ్యాపింపచేస్తాయి.

3. డెంగ్యూ జ్వరం లక్షణాలు మరియు హెచ్చరిక సంకేతాలు ఏమిటి?

ఒక్క సారి దోమకాటుకు గురైన వ్యక్తిలో 4 నుండి 5 రోజులకు లక్షణాలు బయటపడుతాయి. అందులో అధిక జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి, వికారం మరియు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనబడుతాయి.

Exclusive Interview With Dietician Swati Narshana about symptoms and prevention tips

4. లక్షణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

పొత్తికడుపు నొప్పి లేదా సున్నితత్వం, తేలికపాటి వాపు, ఆకలి లేకపోవడం, బలహీనత, ద్రవాలు చేరడం, చలి, విశ్రాంతి లేకపోవడం మరియు నీరసం వంటి హెచ్చరిక సంకేతాలు రోగిలో కనబడుతాయి.

డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు సాధారణంగా ఎవరికైనా సోకిన 4 నుండి 15 రోజుల తర్వాత కనిపిస్తాయి. వైరస్ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించవు. ఇతరులు 2 నుండి 7 రోజుల వరకు లక్షణాలను కలిగి ఉంటారు.

5. మీకు డెంగ్యూ జ్వరం సోకిందని మీ డాక్టర్ ఎలా నిర్ణయిస్తారు?

పైన తెలిన లక్షణాతో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానించినట్లయితే, వెంటనే మీరు డెంగ్యూ వైరస్ కోసం రక్త పరీక్ష చేయించుకోవాలి, రక్త పరీక్ష సమయంలో ఆరోగ్య సంరక్షణ నిపుణులు చిన్న సూదిని ఉపయోగించి మీ చేతిలోని సిర నుండి రక్తం సేకరించి ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత డెంగ్యూ జ్వరాన్ని నిర్థారిస్తారు. .

6. ఎటువంటి లక్షణాలు కనబడకుండా డెంగ్యూ వైరస్ బారిన పడే అవకాశం ఉందా?

అవును, కొన్నిసార్లు డెంగ్యూ ఇన్ఫెక్షన్ వ్యక్తి శరీరంలో ప్రవేశించినా, ప్రజలకు ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ డెంగ్యూ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇది అందరిలో కాదు, కొంత మందిలో ఇలా జరిగే చాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.

xclusive Interview With Dietician Swati Narshana

7. పిల్లలలో డెంగ్యూ లక్షణాలు ఏమిటి?

పిల్లల్లో డేంగ్యూ జ్వరం సోకినప్పుడు వారి శరీరంలో 40 డిగ్రీల సెల్సియస్ ఆకస్మికంగా పెరుగుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళ వెనక నొప్పి, దద్దుర్లు, వాపు, వాంతులు లక్షణాలు కూడా కనబడుతాయి.

8. డెంగ్యూ జ్వరానికి చికిత్స ఏమిటి?

గెంగ్యూ ఇన్ఫెక్షన్ సోకిన రోగిలో లక్షణాలను పర్యవేక్షించడం. దానికి తగ్గట్టు ద్రవాలు మరియు నొప్పి నివారణలు వాడటం. కొన్ని సందర్బాల్లో రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వెంటనే ఆసుపత్రి చేరి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ చికిత్సలో భాగంగా . లిక్విడ్ డైట్‌, ఫ్లూయిడ్స్ మేనేజ్‌మెంట్ మరియు ఆక్సిజన్ అందించడం జరుగుతుంది.

xclusive Interview With Dietician Swati Narshana

9. గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గర్భిణీ మరియు పాలిచ్చే తల్లికి డెంగ్యూ వైరస్ సోకిన గర్భిణీ స్త్రీతో పాటు తనకు పుట్టబోయే బిడ్డకు లేదా అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు డెంగ్యూ సోకే అవకాశం ఉంది. తల్లికి డెంగ్యూ వైరస్ సోకితే వెంటనే గర్భిణీ తల్లులకు సరైన వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యం.

10. మీకు ఒకసారి డెంగ్యూ జ్వరం వస్తే, మళ్లీ వస్తుందా?

అవును. డెంగ్యూ వైరస్‌లో కనీసం నాలుగు వెర్షన్లు (జాతులు) ఉన్నందున, మీరు ఒకటి కంటే ఎక్కువసార్లు డెంగ్యూకి గురి కావచ్చు. మీరు సాధారణంగా అనారోగ్యానికి గురైన మొదటి జాతికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు మరియు దానిని మళ్లీ పొందలేరు. కానీ ఆ తర్వాత మిగిలిన మూడు జాతులలో ఒకదానితో మీరు అనారోగ్యానికి అవ్వొచ్చు.

xclusive Interview With Dietician Swati Narshana

11. డెంగ్యూ రోగిలో ప్లేట్‌లెట్ కౌంట్‌ని పెంచే ఆహారాలు ఏమిటి?

Yes, డెంగ్యూ ఫీవర్ నుండి కోలుకోవాలన్నా వ్యాధినిరోధక శక్తిని పొందడానికి అధిక ప్రొటీన్లు, లీన్ ఫ్యాట్స్, డైరీ ఫుడ్స్, సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు డెంగ్యూ డైట్ లో అనుమతించబడతాయి.

రోగిలో వ్యాధిని నిరోదించడానికి , వ్యాధి రాకుండా అరకట్టడానికి జింక్, మెగ్నీషియం వంటి రిచ్ న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ ఇవ్వవచ్చు ఉదా. ఆపిల్, కివీ, దానిమ్మ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వంటివి ప్లేట్‌లేట్ కౌంట్‌ని పెంచుతాయి.జీర్ణానికి సులువుగా పెసర పప్పు, కంది పప్పు, కూరగాయలు, ధాన్యాలు, తృణధాన్యాలు, మిల్లెట్‌లను తీసుకోవచ్చు.

అలాగే ప్రాసెస్ చేసిన, రొట్టెలు, బేకరీలు, జంక్ ఫుడ్స్, ఎరేటెడ్ డ్రింక్స్, ప్రిజర్వ్డ్ జ్యూస్‌లు వంటి ఆహారాలను తినకుండా నిరోధించాలి. జ్వరం తగ్గే వరకు ఆయిల్ ఫుడ్స్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

12. మలేరియా నుండి డెంగ్యూ ఎలా భిన్నంగా ఉంటుంది?

ప్లాస్మోడియం అనే పరాన్నజీవి మానవులకు వ్యాపించినప్పుడు అనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వస్తుంది, అయితే డెంగ్యూ అనేది సోకిన ఏడిస్ దోమ ఎవరినైనా కుట్టినప్పుడు వచ్చే వైరల్ వ్యాధి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion