Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది?
షుగర్ వ్యాధి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు 50, 60 ఏళ్ల వయస్సులో వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు 20, 30 ఏళ్లలోపే వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుంది. షుగర్ రావడానికి ముఖ్య కారణం మన జీవనవిధానమే. అంటే మన లైఫ్ స్టైయిల్ ప్రాబ్లమే అని డాక్టర్లు తరచుగా చెప్తుంటారు.
అయితే కేవలం స్వీట్లు ఎక్కువ తింటేనే షుగర్ వ్యాధి రాదని, రోజు మొత్తంలో ఎక్కువసార్లు, ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్(పిండి పదార్థాలు) తీసుకుకోవడం ద్వారా షుగర్ వస్తదని డాక్లర్లు చెబుతుంటారు. కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం తీపి వస్తువులే కాదని, రైస్, గోధుమలు, పిండి పదార్థాలు ఎంత ఎక్కువ తీసుకుంటే, ఎంత ఎక్కువసార్లు తీసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇదిలాఉంటే, షుగర్ పేషెంట్లు చాలామందికి ఉండే ఒక సందేహం.. గోధుమ రవ్వ ఉప్మా మంచిదా లేక సుజీ రవ్వతో(బొంబాయి రవ్వ) ఉప్మా చేసుకోవాలా? షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఏ రవ్వ మంచిది? అని. ఈ సందేహానికి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో డాక్టర్ దీప్తి కరేటి సమాధానమిచ్చారు.
సాధారణంగా చూడటానికి సూజీ రవ్వ తెల్లగా ఉంటది కాబట్టి అది తినకూడదు, అది తింటే షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోతాయని.. గోధుమ రవ్వ ఆరోగ్యానికి మంచిది అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి గోధుమ రవ్వను బ్రోకెన్ వీట్ అంటాం. అంటే గోధుమలను ఒక మెషీన్ ద్వారా చిన్న చిన్న పీస్ లుగా కట్ చేస్తారు. దీన్నే గోధుమ రవ్వ(బ్రోకెన్ వీట్)అంటాం.

గోధుమ రవ్వలో 3 భాగాలు ఉంటాయి. అవేంటంటే.. బ్రాన్, జెర్మ్, ఎండోస్పెర్మ్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల గోధుమ రవ్వలో 350 కేలరీలు, 70 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 10 గ్రాముల ప్రొటీన్, 12 గ్రాముల ఫైబర్ ఉంటుంది. విటమిన్ b అధికంగా లభిస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. నెమ్మదిగా జీర్ణమవుతుంది, షుగర్ లెవల్స్ త్వరగా పెరగవు. అయితే ఇందులో 70 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
అదే సుజీ రవ్వ విషయానికొస్తే..ఇందులో కేవలం ఎండోస్పెర్మ్ మాత్రమే ఉంటుంది. ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్ గా జీర్ణం అవుతుంది. దీని గ్లెసెమిక్ ఇండెక్స్(GI)70 వరకు ఉంటుంది. షుగర్ లెవల్స్ ఫాస్ట్ గా పెరగడమే కాకుండా ఇందులో గ్లైసెమిక్ లోటు కూడా ఎక్కువానే ఉంటది. టేస్టీగా ఉంటది కదా, ఈజీగా నమిలేయొచ్చు, ఈజీగా జీర్ణం అయిపోతుందని ఎక్కువగా తినే అవకాశం కూడా ఉంటది. కాబట్టి షుగర్ పేషెంట్లకు సుజీ రవ్వ కన్నా గోధుమ రవ్వ బెస్ట్, 100 శాతం హెల్తీ అని డాక్టర్ దీప్తి చెప్పారు. గోధుమ రవ్వ ఉప్మా ద్వారా ఐరన్, కాల్షియం, మినరల్స్ తో పాటు ఫైబర్, విటమిన్ B కూడా లభిస్తుంది, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్పారు.
అయితే ఏదైనా సందర్భంలో గోధుమ రవ్వ అందుబాటులో లేనప్పుడు, సుజీ రవ్వ మాత్రమే అందుబాటులో ఉంటే అందులో ..హెల్తీగా చేయాలంటే సుజీ రవ్వ ఉప్మాలో కూరగాయల ముక్కలు, పచ్చి బఠాణీలు వేసుకోవచ్చు. పనీర్ తో కూడా కలిపి తీసుకోవచ్చు. అయితే తక్కువగా తినండి. అయితే ఇది అప్పుడప్పుడు మాత్రమే. రెగ్యులర్ గా తినేటప్పుడు గోధుమ రవ్వతో చేసిన ఉప్మానే తినాలని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
