Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దైనందిన జీవనంలో డయాబెటీస్ ప్రభావం!

డయాబెటీస్ రోగులకు దాని ప్రభావం ఉద్యోగంపై ఏ మాత్రం వుండదు. డయాబెటీస్ కలిగి వుండటం మీ తప్పుకాదు. కనుక దానిని దాచవద్దు. మీ తోటి ఉద్యోగులకు మీకు డయాబెటీస్ వుందని కూడా తెలియచేయండి. హైపో అనే లో షుగర్ గురించి వివరించండి. షుగర్ పడిపోతే ఏం చేయాలో ముందస్తుగా వారికి తెలియజేయండి. విషయం తెలియకుంటేనే తోటివారు ఆందోళనపడతారు.
డయాబెటీస్ - ఉపవాసాలు:
మతపర కారణాలుగా ఒక్కోక్కపుడు ఉపవాసాలు వుండటం జరుగుతుంది. ఈ రకమైన ఉపవాసాలు వీరి విషయంలో నష్టం కలిగించే ప్రమాదముంది. అయినప్పటికి ఉపవాసం వుండాలంటే, సందేహం కలిగితే, నిపుణులను ఒకసారి సంప్రదించండి. మీ శారీరక స్ధితి మీకే తెలుస్తుంది. ఉపవాసం ఉన్నపుడు శరీరం తక్కువ దశ షుగర్ కు పడిపోతోందా అని తెలుసుకోడానికి వేలితో శరీరాన్ని గుచ్చి గుంటపడితే లో షుగర్ వచ్చిందని గ్రహించండి. ఇన్సులిన్ తీసుకునే వారైతే దాని పరిమాణాన్ని తీసుకోడం తగ్గించండి. టాబ్లెట్ వాడే వారైతే దానిని వేయకండి.
డయాబెటీస్ - హాస్పిటల్ అడ్మిషన్:
హాస్పిటల్ లో చేరేసమయంలో డయాబెటీస్ నియంత్రణ ప్రధానం. ఏ కారణం చేతైనా హాస్పిటల్ లో చేరితే, అక్కడి డాక్టర్లకు నర్సులకు మీరు డయాబెటిక్ అని తెలుపండి. దాని నియంత్రణ ఎలా వుందో వివరించండి. డయాబెటీస్ మంచి నియంత్రణలో వుంటే మీరు హాస్పిటల్ లో చేరిన వ్యాధులు త్వరగా తగ్గే అవకాశం కూడా వుంది. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు మీ రెగ్యులర్ మెడిసిన్ కొనసాగించండి.
డయాబెటీస్ - రుతుక్రమం:
కొంతమంది మహిళలు తమ రుతుక్రమంలో డయాబెటీస్ కారణంగా ఏ మార్పు పొందరు. రుతుక్రమం ముందు షుగర్ పెరుగుతోందా? ఇన్సులిన్ లేదా టాబ్లెట్ వాడకం పెంచండి. షుగర్ తగ్గుతూంటే వాటి వాడకం తగ్గించండి. ఇటువంటపుడు మీ శరీరానికి తగిన డోసేజీని మీరే నిర్ధారించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications