Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఏమి తినాలి, ఎంత తినాలి ? ఏమి తినకూడదు!

దీనికిగాను ఆహార ప్రణాళిక అంటూ ఆచరించాల్సిన అవసరం లేదు. ప్రతి దినం ఛార్టు చూసుకొని తినడం చాలా కష్టం. అధికాక పండుగలు, లేదా ఇతర వేడుకలకు హాజరైనపుడు మరింత కష్టంగా వుంటుంది. కనుక ఛార్టు కంటే కూడా ఒక ఆహార ప్రణాళిక వుంటే చాలు. షుగర్ వ్యాధి వచ్చిన వారు ఏమి తినాలి? తినాల్సినవి ఆరోగ్యాన్నిచ్చే పదార్ధాలని చెప్పాలి. ఏమి తినాలి, ఎంత తినాలి ? ఏమి తినకూడదు అనేవి తెలిస్తే చాలు. తినాలా ? వద్దా? అనేది ప్రశ్నకాదు. తినేముందు తీసుకునే సరి అయిన నిర్ణయం తెలిసుండాలి.
సాధారణంగా మేము షుగర్ వ్యాధి వారికి మూడు భోజనాలు తీసుకోమని చెపుతున్నాం. అవి ఒకటి బ్రేక్ ఫాస్టు, లంచ్, డిన్నర్ లు మాత్రమే. వీటితో పాటు మూడు స్నాక్ లు మాత్రమే. ఈ మూడు స్నాక్ లను మీ సౌకర్యాన్ని బట్టి మూడు భోజనాల మధ్య వుంచండి. ఆహారంలో ప్రధానంగా ఆరు అంశాలుండాలి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రొటీన్, మినర్, విటమిన్, నీరు. కార్బోహైడ్రేట్ లను రోజంతా వుండేలా చూసుకోవాలి. అన్నం, గోధుమలు రెండూ ఒకే కేలరీలు కలిగి వుంటాయి. అయితే, గోధుమలో ప్రొటీన్లు, పీచు అధికం.
మీరు తీసుకునేది బ్రేక్ ఫాస్టు - స్నాక్స్ -లంచ్- స్నాక్స్ -డిన్నర్ -స్నాక్స్ గా వుండాలి. లేదా బ్రేక్ ఫాస్ట్- స్నాక్స్ -లంచ్- స్నాక్స్- స్నాక్స్ -డిన్నర్ గా వుండాలితీసుకునే పదార్ధాలలో పీచు బాగా వుండాలి. కనుక అన్నం, గోధుమ రెండూ తీసుకుంటూ వుండండి.
పోషకాహార సమతౌల్యానికి గాను సలాడ్ లు, వెజిటబుల్స్ తీసుకోండి. బరువు అధికంగా వుంటే తగ్గించుకోండి. కేలరీ ఆహారం తగ్గించి పీచు ఆహారం అధికంగా తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది.
కిడ్నీ సమస్యలుంటే తప్ప మాంసాహారం మానవద్దు. చికెన్, చేప ల వంటివి మంచిది. కొల్లెస్టరాల్ అధికంగా వుంటే, గుడ్లు, రెడ్ మీట్ మానండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications