For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బలవంతంగా నిద్రను అదిమి పెడితే......!

By B N Sharma
|

Inadequate sleep causes diabetes
నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్ర పోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్ నియంత్రణగా గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్లు ఎక్కువసేపు మెలకువతో వుండే విద్యార్థులు గుర్తించాల్సిన విషయం ఇది.

అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. నిద్రలేమి వారి కొంప ముంచుతుంది.

దీనివల్ల హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకెళ్లే ప్రమాదముంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్త వహించడం మరువకూడదు.

English summary

Inadequate sleep causes diabetes | బలవంతంగా నిద్రను అదిమి పెడితే......!

People with inadequate sleep get diabetes easily. If one doesn't sleep continuously for three days, glucose in the blood changes and if that position continues regularly, it results in getting diabetes. Hence, students who wake up whole nights should remember this and change their sleep patterns.
Story first published:Wednesday, August 31, 2011, 16:33 [IST]
Desktop Bottom Promotion