Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
డయాబెటీస్ వారికి లో షుగర్ వస్తే ఏమవుతుంది?

హైపో వచ్చిందనటానికి లక్షణాలు - బ్లడ్ షుగర్ స్ధాయి 50 ఎంజి లేదా అంతకంటే తక్కువకు పడుతుంది. చెమటలు, వణుకుడు, ఆకలి, గుండె వేగంగా కొట్టుకోవడం వుంటుంది. అందరికి ఈ చిహ్నాలు చూపకపోవచ్చు. వెంటనే ఈ పరిస్ధితి సరిచేసుకోకపోతే, ఆందోళనగాను తెలివి తప్పేదిగాను వుంటుంది. చివరకు కోమాలోకి దారితీస్తుంది.
హైపో వచ్చినపుడు ఏం చేయాలి?
గ్లూకోమీటర్ దగ్గర వుంటే షుగర్ చెక్ చేయండి. ఇది సరి అయిన డయాగ్నసిస్ ఇస్తుంది.
గ్లూకోమీటర్ లేకుంటే వెంటనే ఏదో ఒక ఆహారాన్ని తినండి. పరిస్ధితి వెంటనే మెరుగు పడితే, మీరు హైపో నుండి బయటపడ్డట్లే.
హైపో వచ్చినపుడు ఏం తినాలి?
పండ్లు, బిస్కట్లు, బ్రెడ్, శాండ్ విచ్, పాలు ఏదైనా తినవచ్చు. తీపి పదార్ధాలు వీలైనంతవరకు వాడకండి. అవి తింటే మరల షుగర్ పెరిగే ప్రమాదముంది.
హైపో ను ఎలా సరిచేసుకోవచ్చు?
హైపో సరి చేసుకున్న తర్వాత అసలు అది రావటానికి గల కారణం పరిశీలించండి. మరోమారు రాకుండా చూసుకోండి. సాధారణంగా ఆహారం, ట్రీట్ మెంట్ రెండూ సరిపడకపోతే హైపో వస్తుంది. ఇన్సులిన్ తీసుకొని ఆహారం తీసుకోకపోతే వస్తుంది. డయాబెటీస్ బాగా కంట్రోల్ లో వుండి ఆహారం తీసుకోపోతే హైపో వస్తుంది. ఆహారం తక్కువ తీసుకుంటూ వ్యాయామం అధికంగా చేసినా షుగర్ స్ధాయి పడిపోతుంది. కిడ్నీ కనుక డయాబెటీస్ తో చెడినా లేక ధైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోయినా హైపో వస్తుంది. ఇటువంటపుడు డాక్టర్ ను సంప్రదించండి. హైపో కు ఇన్సులిన్ లేదా టాబ్లెట్ వేయవచ్చు. అయితే టాబ్లెట్ శరీరంలో సుమారు 48 గంటలు ప్రభావం చూపుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications