Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
డయాబెటిక్స్ సిగరెట్లు, ఆల్కహాలు తీసుకుంటే?!

ఆల్కహాలు వైద్యపరంగా ఎంత తీసుకోవచ్చో మీరు తెలుసుకోవాలి. కొద్దిపాటి విస్కీ, రమ్, వోడ్కా లేదా జిన్, ఒక గ్లాసు బీరు లేదా వైన్ ఒక యూనిట్ గా లెక్కించబడుతుంది. వారానికి పురుషులకు 21 మహిళలకు 14 యూనిట్లు అనుమతించబడింది. వారంలో ఒక్క రోజే ఆ కోటా అంతా తాగేకంటే గ్యాప్ ఇస్తూ వారమంతా తాగటం మంచిది. స్వీట్ వైన్ లేదా షెర్రీ వంటివాటిలో అధిక షుగర్ వుంటుంది కనుక వాటిని వదిలేయటం మంచిది. సాధారణంగా తాగేటపుడు మనం ఏం తింటున్నామో తెలియదు. అధిక కొవ్వు లేదా అధిక కేలరీ కల పనీర్ లేదా పకోడిలు డ్రింక్ తో తీసుకుంటే అధిక కేలరీలు లోపలికి పోయినట్లే. కనుక టొమాటో లేదా ఆనియన్ లేదా కుకుంబర్ లను డ్రింక్ తో తీసుకోండి. లేదా కొద్దిపాటి పొటాటో చిప్స్ బాగానే వుంటాయి.
లేదంటే అసలు డ్రింక్ మానేయటం మంచిదే. డ్రింక్ చేస్తే చాలా ప్రమాదాలున్నాయి. మీ భోజనం మరచిపోయి 'లోషుగర్' స్ధాయికి చేరచ్చు. ఇక తాగితే మీ షుగర్ పరీక్షలకు కూడా అందదు. మీకు లోషుగర్ వచ్చిందని ఆహారం ఇవ్వాలని స్నేహితులకు కూడా తెలియకపోవచ్చు. అన్నిటికి మించి తాగి వాహనం నడిపితే మీరు ఎవరికైనా హాని కలిగించవచ్చు.
పొగ తాగితే?
పొగ తాగితే, ఇన్సులిన్ స్ధాయి పడిపోతుంది. కనుక వదిలేయాలి లేదా బాగా తగ్గించివేయాలి. ఏది ఏమైనప్పటికి పొగతాగటం గుండెకు లంగ్స్ కు ప్రమాదం. స్మాకింగ్ అనేది వివిధ అవయవాలకు కేన్సర్ కలిగించే ప్రమాదముంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications