Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ అవసరమా?

పొట్టలో పాన్ క్రియాస్ అనే గ్రంధి నుండి ఉత్పత్తి అయే హార్మోన్ ఇన్సులిన్. మనం ఆహారం తిన్నపుడు పొట్టలోని ఆహారంలోగల గ్లూకోజు రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ గ్లూకోజు శక్తి నివ్వాలంటే కణాలలోకి ప్రవేశించాలి. ఇన్సులిన్ గ్లూకోజును కణాలలోకి ప్రవేశింపజేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ వున్న వారికి పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. టైప్ 2 డయాబెటీస్ కు ఇన్సులిన్ సరిపడా వుండదు. కనుక ఇరువురికి ఇన్సులిన్ అవసరం వుంటుంది.
ఇన్సులిన్ ఎలా పొందాలి?
ఇన్సులిన్ ఒకప్పుడు చనిపోయిన జంతువుల పాన్ క్రియాస్ గ్రంధి నుండి సేకరించేవారు. ఇపుడు వాటితో సంబందం లేకుండా లేబరేటరీలలో తయారు చేస్తున్నారు. కనుక ఇతర అంటు వ్యాధులు వచ్చే అవకాశం కూడా లేదు.
ఏ రకం డయాబెటీస్ కు ఇన్సులిన్ కావాలి?
టైప్ 1 డయాబెటీస్ వారికి జీవించాలంటే ఇన్సులిన్ కావలసిందే. టైప్ 2 డయాబెటీస్ వారికి కూడా గర్భవతులుగా వున్నపుడు సర్జరీలలోను, ఆహారం తినలేని పరిస్ధితి వచ్చినపుడు, టాబ్లెట్ లు పనిచేయనపుడు డయాబెటీస్ నియంత్రణకై ఇన్సులిన్ ఇస్తారు.
టాబ్లెట్ ల కంటే ఇన్సులిన్ మెరుగైనదా?
మెరుగైనదే! ఇన్సులిన్ అధిక ప్రయోజనం ఇస్తుంది. ఇన్సులిన్ నేరుగా శరీరంలోకి తీసుకోవటం సహజం. టాబ్లెట్లు సహజమైనవి కావు. వ్యాధి మొదట్లోనే ఇన్సులిన్ తీసుకుంటే పాన్ క్రియాస్ గ్రంధిదీర్ఘకాలం పని చేస్తుంది. తన ఉత్పత్తిని అందిస్తుందని ఇటీవలి పరిశోధనలు తేల్చాయి. సమస్యల్లా, నేటికీ మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాల్సిందే. ఏదో ఒకనాటికి ఇపుడు వచ్చే షుగర్ వ్యాధులకు టాబ్లెట్లు పని చేయని స్ధితి వస్తుంది. అపుడు అందరూ ఇక ఇన్సులిన్ పై ఆధారపడవలసిందే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications