Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజ ఆహారాలతో డయాబెటీస్ త్వరగా తగ్గాలంటే!

డయాబెటిక్ రోగంతో బాధపడే వారికి సహజ ఆహారాల పరిష్కారంగా కాకర కాయ రసం ఇస్తే ఆ జబ్బు అదుపులోవుంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక గుణం ఉండటం మూలాన మధుమేహ రోగులకు ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి రోజు ఉదయంవేళ పరకడుపున సేవిస్తుంటే డయాబెటిక్ వ్యాధి అదుపులోవుంటుంది.
కాకర కాయ రసం ఎంతో చేదైనప్పటికి దానితో పాటుగా టమాటా లేక నిమ్మకాయ వంటివి కూడా కలిపి తాగితే, ఫలితం బాగానే వుంటుంది. కాకర కాయ రసాన్ని పర గడుపును ఉదయం వేళ తీసుకుంటే కూడా మంచిదే నంటారు. కాకర కాయ రసాన్ని తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు: 3 లేదా 4 తాజా కాకర కాయలు, అరచెక్క నిమ్మకాయ, చిటికెడు ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు, రెండు టమాటాలు, చిన్న కీరకాయ ఒకటి.
ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే...కాకర కాయ, టమోటా, కీరకాయ మూడింటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయండి. ఇందులో ఒక గ్లాసు నీరు కలపండి. తెల్లటి గుడ్డలో ఈ మిశ్రమాన్ని వడగట్టండి. తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండి ప్రతి రోజు ఉదయం వేళ పరకడుపున తాగండి. ఇలా ప్రతి రోజు తాగితే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్త ప్రసరణలో కూడా ఈ రసం బాగా తోడ్పడుతుందని పరిశోధకులు చెపుతున్నారు.. దీంతోపాటు ఆహారపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, క్రమం తప్పని వ్యాయామాలు చేస్తే మధుమేహవ్యాధి అదుపులోవుంటుందంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications