Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
డయాబెటీస్ వ్యాధి నయం చేయవచ్చా?

ఏ రకమైన డయాబెటీస్ రివర్స్ చేయవచ్చు? డయాబెటీస్ రెండు రకాలుగా వుంటుంది. ఒకటి పిల్లలలో వచ్చేది. వీరిలో పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ అసలు ఉత్పత్తి చేయదు. ఇన్సులిన్ అనేది షుగర్ ని శక్తిగా మారుస్తుంది. మరి ఇన్స్ లిన్ కనుక శరీరంలో లేకుంటే బయటనుండి దానిని అందించాల్సివుంటుంది. పుటుకతో వచ్చే ఈ డయాబెటీస్ కు ఇన్సులిన్ బయటనుండి అందించడమే చికిత్సా పరిష్కారం.
టైప్ 2 డయాబెటీస్ అనేది రెండవరకం డయాబెటీస్. ఇది జీవన విధానంలోని అసమతుల్యతలకు వస్తుంది. సాధారణంగా మధ్య వయసు వారిలో వస్తుంది. ఊబకాయం, అనారోగ్య జీవన విధానం వుంటే త్వరగా వస్తుంది. వీరిలో ఇన్సులిన్ సరిగా పనిచేయదు. శరీర కణాలలో కొవ్వు అధికంగా వుండటంతో అవి గ్లూకోజు ను పీల్చలేవు. ఈ పరిస్దితికి పాన్ క్రియాస్ గ్రంధి మరింత అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. ఈ రకమైన డయాబెటీస్ ను రివర్స్ చేయవచ్చు.
టైప్ 2 డయాబెటీస్ ను ఎలా రివర్స్ చేయాలి?
నూటికి 90 మంది ఈ రకం డయాబెటీస్ తో బాధ పడుతున్నారు. మీకు కనుక ఈ డయాబెటీస్ వున్నట్లయితే, మొదటి దశలలో దీనిని రివర్స్ చేయవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. మరి దీనినిగురించి కొంత తెలుసుకోండి.
డయాబెటిస్ మొదటి దశ - మొదటి సారి మీ బ్లడ్ షుగర్ 120 రీడింగ్ దాటితే మిమ్మల్ని డయాబెటిక్ అనటానికి వీలు లేదు. అపుడే మీ ఇన్సులిన్ సరిగా పని చేయని దశకు వచ్చింది. మీరు పూర్తి డయాబెటిక్ కాదు.
ఆ దశలో మీరు తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలి. అధిక బరువు తగ్గించుకోవాలి. కనీసం 3 నెలలపాటు తగిన ఆహార ప్రణాళిక ఆచరించాలి. ఈ లోపు మీ పాన్ క్రియాస్ గ్రంధి దానిలోని కొవ్వు కరిగించుకుంటుంది. మరల సాధారణంగా పనిచేస్తుంది. ఈ సమయంలో పీచు అధికంగా వుండే ఆహారాలు మీరు తినాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం ప్రతిరోజూ తప్పక చేయాలి. వేగవంతమైన నడకలు లేదా జాగింగ్ నిరంతరంగా చేయాలి. అపుడే మీరు ఈ వ్యాధిని తగ్గించుకోగలరు. మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా డయాబెటీస్ చరిత్ర వుంటే, మరి మీ జీవన విధానం మీ 30 సంవత్సరాల వయసునుండే సక్రమంగా వుండేలా చూసుకోండి. డయాబెటీస్ వ్యాధిని నిరోధించాలంటే, మీ అనారోగ్య జీవన విధానానికి దూరంగా వుండాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అంతకు మించి డయాబెటీస్ వ్యాధిని దూరం చేసుకోవాలంటే మరో మార్గం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications