Latest Updates
-
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే! -
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం!
దంతాలపైన నల్లని మచ్చలు, లేదా రంధ్రాలు ఉంటే?

షుగర్ వ్యాధి రోగులకు నోటిలో పూత వచ్చినా, పుండ్లు పడినా నివారణకు ఎంతో కాలం పడుతుంది. వీరికి ఎపుడూ నోటిలో లాలాజలం అధికంగా వుండి సమస్యలు కలిగిస్తూంటుంది. నోటి రుచికూడా మారిపోతుంది. వీరికి వచ్చే దంత సమస్యలకు అశ్రద్ధ చేయకుండా తరచుగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. దంతాలు, శరీరంలోని అన్ని భాగాలకంటే కూడా పటిష్టమైనవి. శరీరంలోని ఏ అంగం నాశనమైనప్పటికి వారి దంతాలు మాత్రం అంత తేలికగా డామేజ్ కావు. అటువంటి దంతాల సంరక్షణ, ప్రత్యేకించి షుగర్ వ్యాధి రోగులలో ఎంతో ప్రధానమైనదిగా గుర్తించాలి. సాధ్యమైనంత మేరకు వీరు ఏ ఆహారం తిన్నప్పటికి ఒక సారి నీటిని పుక్కిలించి ఉమ్మివేయటం చేయాలి. రోజుకు రెండు సార్లు, అంటే ఉదయం, రాత్రి భోజనం అయిన తర్వాత రెగ్యులర్ గా బ్రష్ చేసుకోవాలి. సాధారణ బ్రషింగ్ తర్వాత, మౌత్ వాష్ వంటి ఔషధాలను కూడా వాడి తమ దంత సంరక్షణ, నోటి సంరక్షణ చేసుకుంటే, ఎప్పటికపుడు వచ్చే సమస్యలను అధిగమిస్తూంటే, దంతాల ఆరోగ్యం బాగుంటుంది.
- దంత ధావనం చేసే సమయంలో చిగుళ్ళు రక్తం కారుతున్నాయా?
- చిగుళ్ళు ఎర్రగా వాచి తాగితే చాలు నొప్పి అన్పిస్తున్నాయా?
- దంతాల నడుమ, చిగుళ్ళనుండి చీము వస్తుందా?
- నోరు బాగా దుర్వాసనగా ఉందా?
- దంతాలు కదులుతున్నాయా?
- ధృఢమైన వస్తువులు కొరకటం కష్టం అనిపిస్తోందా?
ఇలాంటి సందర్భాలలో షుగర్ రోగులు విధిగా డెంటిస్ట్ ను సంప్రదించి తీరాలి. డెంటిస్ట్ కు మీకు షుగర్ ఉందన్నవిషయం మీరు తప్పక తెలియచేయాలి. దంతాల చుట్టూ ఉన్న చిగుళ్ళు వాచినా, వత్తితే వాటి నుండి బ్లడ్ లేదా చీము వస్తున్నా, చిగుళ్ళు నొప్పిగా ఉన్నా, తెలుపు లేక ఎర్రని మచ్చలు చిగుళ్ళు, నాలుక, నోటిలోపల, ఎక్కడైనా కన్పించినా, నమలటం బాధగా అనిపించినా, అతి చల్లని అతి వెచ్చని ఆహారాలు తినటం కష్టంగా అనిపించినా, దంతాలపైన నల్లని మచ్చలు లేదా రంధ్రాలు మీరు గమనించినా, దంతవైద్యుని సంప్రదించాల్సిందే.
డయాబెటిక్స్ రోగులలో ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ త్వరగా వస్తాయి. నోటికి సంబంధించి బాధలు త్వరగా తగ్గవు. కొందరికి నోరు బాగా ఎండిపోయి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులన్నీ మీకు చికిత్స చేసే వైద్యునితో విధిగా సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications