Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
హైపర్ గ్లైసీమియా లక్షణాలు ఎలా వుంటాయి?

టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ లు రెండింటిలోనూ పేషెంట్ తెల్సుకోవలసిన మరో కండిషన్ హైపర్
గ్లైసీమియా లేదా అధిక షుగర్ గురించి. డయాబెటీస్ తో బాధ పడేవారిలో నూటికి నూరుమంది ఏదో
ఒక దశలో హైపర్ గ్లైసీమియాకు గురవుతారన్నది ఒక వాస్తవం. హైపర్ గ్లైసీమియా అంటే, హై బ్లడ్
గ్లూకోజ్ ఏర్పడే పరిస్ధితి. ఈ స్టేజ్ కి రావటానికి చాలా మార్గాలున్నాయి. టైప్ 1 డయాబెటీస్ తో బాధ పడేవారు, సరిపడేంత ఇన్సులిన్ తీసుకోకపోయినా, టైప్ 2 డయాబెటీస్ తో బాధ పడేవారు అధికంగా ఆహారం తీసుకున్నా, వారు వేసుకునే మందులు రెసిస్టెన్స్ వచ్చిన కారణంగా పనిచేయకపోయినా, రెగ్యులర్ గా చేసే వ్యాయామం చేయకపోయినా, ఏ రకమైన స్ట్రెస్ లకు వారు గురయినా, వారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బాగా పెరుగుతుంది కనుక హైపర్ గ్లైసీమియా లక్షణాల గురించి ప్రతి డయాబెటీస్ పెషెంట్ తప్పక తెలుసుకోవాలి.
రక్తంలో, మూత్రంలో గ్లూకోజ్ అధికంగా వుంటుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసిన పరిస్ధితి
వస్తుంది. దాహం అధికంగా అవుతుంది. ఈ పరిస్ధితి మీరు గుర్తించి తక్షణం తగు చికిత్స, తీసుకోకపోతే,
హైపర్ గ్లైసీమియా కారణంగా డయాబెటిక్ కోమాకు రోగి వెళ్ళే అవకాశం ఉంది. దీనినే కీటోఎసిడోసిస్
అని కూడా వ్యవహరిస్తారు. మీ శరీరంలో తగిన స్ధాయిలో ఇన్స్ లిన్ లేని పక్షంలో, మీ ఆహారం ద్వారా
లభించిన గ్లూకోజ్ ను మీ శరీరావసరాలకు ఇంధనంగా మీ శరీరం వినియోగించుకోదు. ఇలాంటి
పరిస్ధితిలో మీ శరీరంలో ఉండే కొవ్వును బ్రేక్ చేసి మీ శరీరావసరాలకు ఇంధనంగా ఉపయోగించుకుంటుంది.
ఇలా ఫ్యాట్స్ ను బ్రేక్ డవున్ చేసి ఇంధనంగా ఉపయోగించుకునే ప్రక్రియలో కీటోన్స్ అనే వ్యర్ధ పదార్ధాలు, ఉత్పత్తి అవుతాయి. ఈ కీటోన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మన శరీరం వీటిని భరించలేదు. తక్షణం మూత్రం ద్వారా వీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. అయితే, మన శరీరంలోని మొత్తం కీటోన్స్ ఇలా మూత్రం ద్వారా బయటకు పంపటం అన్నది నూటికి నూరు శాతం మన శరీరం చేయలేదు. కనుక కొన్ని కీటోన్స్ మన రక్తంలో నిలిచిపోతాయి. ఇలా రక్తంలో అధిక మొత్తంలో కీటోన్స్ నిల్వ ఉన్నపుడు కీటో ఎసిడోసిస్ అనే కాంప్లికేషన్ సంభవిస్తుంది. ఈ పరిస్ధితి ప్రాణాంతకమైనది. అర్జంటుగా ట్రీట్ చేయవలసిన అవసరం ఉన్నది.
కీటో ఎసిడోసిస్ యొక్క లక్షణాలు ఎలా వుంటాయంటే...పేషెంట్ గాలి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతూంటాడు. వీరి నాసికారంధ్రాల ద్వారా వెలువడే గాలి పండ్ల వాసన వస్తుంది. వాంతులవుతాయి. వాంతులయ్యే సెన్సేషన్ కూడా అధికంగా ఉంటుంది. నోరు బాగా ఎండిపోతుంది. ఈ కాంప్లికేషన్ ను మీకు మీరుగా కాకుండా డాక్టర్ ను సంప్రదించి వారి పర్యవేక్షణలో ట్రీట్ చేయాల్సిన అవసరం వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications