For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ వ్యాధి నియంత్రణలో తియ్యగా...?

By B N Sharma
|

Control Diabetes For A Happy Life?
షుగర్ వ్యాధి రోగులు ఎపుడూ వైద్య పర్యవేక్షణలో వుండాలి. వీరు ఎల్లపుడూ తమ శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. అందుకవసరమైన ఆహారం పానీయాలు తీసుకుంటూ మిగిలిన జీవనాన్ని గడపాలి. నియంత్రణలేని డయాబెటీస్ రోగులకు దుర్భరమైన జీవనాన్ని ఇస్తుంది. కొన్ని సమయాలలో రోగులు తమ అవయవాలను సైతం కోల్పోయేలా చేస్తుంది. డయాబెటిక్ రోగులు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. అయితే డయాబెటీస్ కనుక సరైన వైద్య పర్యవేక్షణలో వుండి నియంత్రణలో వుంటే రోగికి ఎట్టి ప్రమాదం వుండదు.

డయాబెటీస్ వ్యాధి ముదరకుండా రోగి తన బరువును ప్రధానంగా ఎప్పటికపుడుతన ఎత్తుకు సమానంగా నియంత్రించుకోవాలి. ఈ చర్య అతని శరీరంలోని హానికర రసాయనాలను, వ్యర్ధ పదార్ధాలను కూడా తొలగిస్తుంది. గుండె, లివర్, పాన్ క్రియాస్ వంటి ప్రధాన భాగాలు సమర్ధవంతంగా తమ పనిని నిర్వహిస్తాయి. రోగి నిరంతరం, మరియు శాశ్వతంగా అంటే ఎల్లపుడూ తన రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిలను నియంత్రించుకోవాలి. సరైన మందుల మోతాదు. ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక అవసరం.

డయాబెటిక్ రోగులు ప్రధానంగా తాము తినే ఆహారాలను నియంత్రించుకోవాలి. వీరికి అధిక తీపి, పులుపు, ఉప్పు, వంటివి పనికి రాదు. వీరు తినే ఆహారంలో కార్బో హైడ్రేట్లు తక్కువగా ఉండాలి. అంటే, తెల్లటి బియ్యపు అన్నం వీరి ఆరోగ్యానికి సరిపడదు. బదులుగా, చపాతీలు, రొట్టెలు లేదా పుల్కాల వంటివి అధికంగా తినాలి. వీరి ఆహారంలో ఉప్పును మానివేస్తే, షుగర్ వ్యాధి పూర్తి నియంత్రణకు వచ్చేస్తుంది. అన్నిటికి మించి వీరు తినే విధానాలు కూడా మార్చుకోవాలి. రాత్రి పొద్దుపోయి తినే డిన్నర్ వంటివి వీరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చేసిన డిన్నర్ కు నిద్రించే సమయానికి మధ్య కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి ఉండాలి.

రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిలను నియంత్రించాలంటే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామంతో జీవప్రక్రియ మెరుగుపడుతుంది. ఈ చర్య శరీరంలోని గ్లూకోజ్ ను ఖర్చు చేస్తుంది. నిల్వగా వున్న గ్లూకోజ్ సైతం ఖర్చు చేయబడి లివర్ ఆరోగ్యంగా వుంటుంది. పాన్ క్రియాస్ గ్రంధి సమర్ధవంతంగా పనిచేస్తుంది. మరో ప్రధాన అంశంగా రోగి ఒత్తిడిలేని జీవనం సాగించాలి. రాత్రులందు తీసుకునే గాఢ నిద్ర మరుసటి రోజు అతను చురుకుగా వుండేందుకు దోహదం చేస్తుంది. బరువు నియంత్రణ, వైద్య పర్యవేక్షణ, ఆరోగ్యకర ఆహారం అంశాలు ప్రధానంగా రోగి ఆచరించాలి. ఈ అంశాలన్ని పాటిస్తే, డయాబెటీస్ వున్నప్పటికి సాధారణ జీవనం సంతోషంగా గడపవచ్చు.

English summary

Control Diabetes For A Happy Life? | షుగర్ వ్యాధి నియంత్రణలో తియ్యగా...?


 Diabetics must always be under medical care. They have to monitor the levels of insulin in their bodies and watch what they eat and drink for the remainder of their natural life. Uncontrolled diabetes, of either type can be fatal or produce extremely serious consequences to body and limb. Millions of diabetics all around the world lead perfectly normal lives with this condition.
Story first published:Monday, July 30, 2012, 16:42 [IST]
Desktop Bottom Promotion