Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అధిక బరువు తగ్గించుకోండి ?
అలవాట్లు మానుకోలేము.అయితే, ఆ అలవాటుకు బదులు మరో అలవాటు చేసుకొని కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎపుడైనా ఒక చాక్లెట్ తింటే ఆరోగ్యానికి హాని లేదు. కాని అది ప్రతిరోజూ తింటే హాని కలిగిస్తుంది.

మరి అప్పటివరకు ఉన్న అలవాట్ల స్ధానంలో ....బరువు అధికం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనేది చూద్దాం.
నిద్ర సరిగా లేకుంటే శరీరం బరువు పెరుగుతుందని స్టడీలు చెపుతున్నాయి. నిద్ర లేమి మీ మెటబాలిజంను 5 నుండి 20 శాతం వరకు త్గిస్తుందని మీలోని ఆకలిని నియంత్రించే హార్మోన్లను మార్పు చేసి రోజంతా ఏదో ఒకటి తినేసేలా చేస్తుందని స్టడీలు తెలుపుతున్నాయి. నిద్ర పట్టనందుకు కారణాలు తెలుసుకొని పరిష్కరించుకోండి.
నేను చాలా చాలా బిజీ అంటూ ఇంటి ఆహారం తినకుండా, బయట కారులోనే లేదా ఉన్న చోటే సమోసాలు, బర్గర్ లు తింటే ప్రతిరోజూ మీ కేలరీల కోటా పెరిగి లావెక్కిపోతారు. కనుక ఎంత దూర ప్రయాణం ఉన్నప్పటికి మంచి భోజనం, త్రాగునీరు మీ వద్ద ఉంచుకోండి.
టి.వి. ముందు కూర్చొని భోజనం చేస్తున్నారా? మీకు తెలియకుండానే అధికంగా తినేస్తారను. మీరు తినే రుచులు కూడా తెలియవు. వేగంగా తినేస్తారు. మీరు తినే ఆహారం సరిపోయిందని తెలుపటానికి మీ బ్రెయిన్ కు సమయం పడుతుంది. మీరు టీ.వి. చూడటంలో నిమగ్నం అయిపోతే, సరైన సమాచారం లేక మీరు ఎంత తిన్నారనేది కూడా తెలియదు. కనుక టి.వి. లేదా ఇతర కార్యక్రమాలు చూస్తూ ఆహారం తినకండి.
ప్రతిరోజూ ఒకే ఆహారం తింటున్నారా? ఒకే రకమైన ఆహారం తింటూ బోర్ కొట్టేసి తరచుగా అనారోగ్య ఆహారాలు అతిగా తినేస్తారు. కనుక మీరు తినేదానిలోనే వెరైటీ చేర్చి ఆరోగ్యకరంగా తినండి. ఒక రోజు స్వీట్, మరో రోజు హాట్ వలే తినండి.
ప్లేట్ లోని ఆహారం మిగిలిపోతుంది అంటూ చివరి వరకు తినేయకండి. ఎంత కావాలో అంతే పెట్టుకు తినండి. ఎక్కువ అనిపిస్తే, వదిలేసి వేరొకరికి అందించండి. వేస్ట్ అయిపోతోంది అంటూ పూర్తిగా తిని అనారోగ్యం కొనితెచ్చుకోకండి.
మీరు తినే ప్రతి ఆహారం వాసన చూసి తినండి. ఈ చర్య మీరు కావలసిన దానికంటే అధికంగా తిన్నట్లు మీ బ్రెయిన్ గుర్తించేలా చేస్తుంది. టి.వి.కి బదులుగా ఒక గంట నడవండి. లేదా జిమ్ కి వెళ్ళటం, ట్రెడ్ మిల్ చేయటం చేయండి. ఈ రకమైన వ్యాయామాలు చేసే సమయంలో మంచి సంగీతం వినండి. స్నేహితులతో కలిసి వాకింగ్ వంటివి చేయండి.
తగినంత నీరు తాగటం, ఆరోగ్యకర హెర్బల్ టీలు తాగడం చేయండి. అర్ధం లేని ఆహారాలు ఎపుడు పడితే అపుడు తినకండి. మీరు తినే ఆహారాలు కంటికి ఆకర్షణీయంగా తయారు చేసుకొని అతి మెల్లగా నమిలి, వాసనలు చూసి ఆనందిస్తూ తినండి. తినే సమయం అధికంగా తింటే మీరు ఎంతో అధికంగా తిన్నట్లు అనిపిస్తుంది. ఇష్టంగా తినే ఆహారాలు, అంటే ఆరోగ్యాన్ని చెడగొట్టనివి మీ వద్ద స్టాక్ పెట్టుకోండి. అపుడు మీరు అనవసర ఆహారాల జోలికి పోకుండా మీ వద్ద ఉన్నవాటినే తింటూ ఉంటారు. ఈ రకంగా బరువును నియంత్రించుకుంటూ, ఊబకాయం కారణంగా డయాబెటీస్ వంటి వ్యాధులు దరి చేరకుండా చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications