Latest Updates
-
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
అత్యంత ప్రమాదకారి....మధుమేహ వ్యాధి!

శారీరక శ్రమ లేకపోవడం, క్రమబద్ధమైన జీవనం పాటించకపోవడం, సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి మూలం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే ఎంతో ప్రమాదకరం. వయస్సుతో నిమిత్తం లేకుండా ఇది అన్ని వయస్సుల వారిని టార్గెట్ చేస్తున్నది. పిల్లల్లోను ఈ వ్యాధి కనిపిస్తున్నది.మధుమేహం బిపి, గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. ఇది సైలెంట్ కిల్లర్. శారీరక వ్యవస్థను ఇది దెబ్బతీసే ప్రమాదం హెచ్చుస్థాయిలో ఉంటుంది. అందుకే దీనిని వైద్యుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేకుంటే ప్రాణాపాయం తప్పదని చెప్పవచ్చు.
షుగర్ వ్యాధి లేని వారికంటే షుగర్ వ్యాధి వున్న వారికి గుండె జబ్బుల రిస్క్ అధికం. అధికంగా ఏర్పడే గ్లూకోజ్ రక్తనాళాలను, గుండె కండరాన్ని డ్యామేజ్ చేస్తుంది. గుండె కొట్టుకోవడంలో అసమతుల్యతలు ఏర్పడతాయి. నొప్పి సంకేతాలు నరాల ద్వారా మాత్రమే తెలుస్తాయి. కనుక ఇటువంటి వారికి నొప్పిలేని గుండె పోటు వచ్చే అవకాశాలుంటాయి.
దీని లక్షణాలు ఎలా వుంటాయంటే...ఛాతీలో అసౌకర్యం అనిపించడం, చేతులు, వీపు, నోటి దవడ లేదా పొట్ట భాగాలనుండి నొప్పి రావడం వుంటుంది. శ్వాస సరిగా ఆడదు, చెమట పట్టటం, వికారం అనిపించడం వుంటుంది. మహిళలకు ఈ లక్షణాలు తక్కువగా చూపుతాయి. డయాబెటిక్ రోగులలో గుండె జబ్బు అరికట్టటానికి సంవత్సరానికి ఒక సారి తప్పక గుండెను పరీక్షింపజేయాలి. కొల్లెస్టరాల్, రక్తపోటు వంటివి చెక్ చేయాలి. అవసరపడితే ఇతర పరీక్షలు కూడా చేయించాలి. డయాబెటీస్, గుండె జబ్బులు రెండూ కూడా షుగర్, రక్తపోటులను అరికడుతూ, రెగ్యులర్ వ్యాయామాలు చేయడం ద్వారా నియంత్రించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications