Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ ఎలా? హాని, లక్షణాలు?

డయాబెటీస్ వ్యాధి వున్న వారికి శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. లేదా ఉన్న ఇన్సులిన్ సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు. ఈ కారణంగా శరీరంలో షుగర్ నిల్వలు పెరిగిపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పెరిగి జీవప్రక్రియ లోపించి శరీరంలోని ప్రధాన అవయవాల చర్యలు సమర్ధత కోల్పోతాయి. ఈ పరిస్ధితిని కనుక వైద్యం చేయకుండా అలానే వదిలేస్తే, డయాబెటీస్ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. గుండె వ్యాధులు, కండ్లకు చూపు మందగించటం, కిడ్నీలు విఫలమవటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి.
డయాబెటీస్ రెండు రకాలుగా వస్తుంది. మొదటిది టైప్ 1. దీనికి ఇన్సులిన్ తీసుకోవడమే మార్గము. ఇది పిల్లలలో వచ్చే వ్యాధి. ప్రారంభంలోని పాన్ క్రియాటిక్ సెల్స్ నష్టం అయి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కనుక వీరికి ఇన్సులిన్ ఎక్కించడమే చేయాలి. లక్షణాలు ఎలావుంటాయంటే, రక్తంలో, మూత్రంలో షుగర్ లెవెల్ పెరగడం, తరచుగా మూత్రం పోయడం, ఆకలి, దాహం, బరువు తగ్గటం, బలహీనం, అలసట, భావోద్రేకాలు, వికారం, వాంతులు మొదలైనవి.
టైప్ 2 డయాబెటీస్ - వీరికి ఇన్సులిన్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి లేదా అధిక బరువున్న వారికి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు, దాహం, మూత్రం అధికంగా పోయటం, అలసట, చికాకు, వికారం, చర్మంపై ఇన్ ఫెక్షన్, చూపు మందగించడం, పొడిచర్మం, చర్మం చురుక్కు మనటంగా వుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications