Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ తో వచ్చే కంటి సమస్యలు!

డయాబెటీస్ రోగులకు వచ్చే సాధారణ కంటి జబ్బును డయాబెటిక్ రెటినోపతీ అంటారు. వీరికి గ్లూకోమా మరియు కాటారాక్ట్ లు కూడా అతి త్వరగా ఏర్పడతాయి. ఈ రెండు వ్యాధులు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్నిచూపుతాయి. డయాబెటిక్ కంటి వ్యాధులు అనే దానిలో కంటికి సంబంధించిన అనేక సమస్యలు నివారిస్తారు. వీటిలో ఏ ఒక్కటి అశ్రధ్ధ పరచినా అది కంటి చూపును మందగించటం లేదా పూర్తి గుడ్డితనానికి దారితీయటం జరుగుతుంది.
సాధారణ వ్యక్తులకంటే, డయాబెటీస్ వ్యాధి వున్నవారు కాటారాక్టులు లేదా గ్లూకోమాలతో రెండు రెట్లు బాధపడతారు. మరి డయాబెటీస్ కంటి సమస్యలంటే ఏమిటి అనేది పరిశీలిస్తే, డయాబెటీస్ కంటి సమస్యలు రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలను చికిత్స చేయకుండా వుంటే వస్తాయి. లేదా వంశానుగతంగా లేదా డయాబెటీస్ కారణంగా వస్తాయి. డయాబెటీస్ వున్నవారు కనీసం సంవత్సరానికోసారి తమ చూపు పరీక్ష చేయించుకోవాలి. అది వారికి ఎంతో మేలు కలిగిస్తుంది.
కంటికి చేసే లేజర్ సర్జరీ డయాబెటీస్ కారణంగా చూపుతగ్గే అవకాశాలను తగ్గిస్తుందని స్టడీలు చెపుతున్నాయి. అయితే, ఒక సారి నష్టపోయిన తర్వాత లేజర్ సర్జరీలు నష్టాన్ని భర్తీ చేయలేవు.
డయాబెటీస్ కంటి సమస్యలనేవి బ్లడ్ షుగర్ నియంత్రణతో నేరుగా సంబంధం కలిగి వున్నాయి. మీ బ్లడ్ షుగర్ తరచుగా నియంత్రణలో వుంటే గణనీయంగా కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈఅంశం అనేక స్టడీలలో రుజువు చేశారు.
డయాబెటిక్ రెటినోపతీ అనేది షుగర్ వ్యాధి రోగుల కంటి సమస్య అది గుడ్డి తనానికి కూడా దోవతీస్తుంది. ఈ దశకు రావాలంటే ముందుగా బ్యాక్ గ్రౌండ్ న్యూరోపతీ, మాకెలోపతీ మరియు ప్రొలిఫరేటివ్ రెటినోపతీ అని మూడు దశలు దాటాల్సివుంటుంది. కనుక ప్రారంభ దశలోనే తగిన చికిత్సలు చేయించుకుంటే మీరు కంటిని కాపాడుకోగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications