Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అధిక సమయం కూర్చుని పని చేస్తే షుగర్ వ్యాధి!

అంతేకాదు, ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో కూడా వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి షుగర్ వ్యాధి బారిన పడేందుకు ప్రధాన కారణాలని ఈ అధ్యయనం చెబుతోంది.
వీటన్నింటితోపాటు రోజువారీ శారీరక శ్రమలేని జీవన విధానం కూడా షుగర్ వ్యాధి పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ... నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని కూడా వారు చెబుతున్నారు.
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా... వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం లాంటివి చేస్తే శారీరక కండరాలకు కదలికకలిగి అది చాలా ప్రయోజనం చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలా రోజూ ఆఫీసు పనిలోకూడా పచార్లు చేయడం వల్ల... ఉదయంపూట వ్యాయామాలకంటే మంచి ఫలితాలను పొందవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి... మితిమీరిన పనిభారంతో ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ పనిచేసేవారు ఈ రీసెర్చిలో తెలిపినట్లుగా అవకాశం దొరికినపుడల్లా లేచి అటూ ఇటూ తిరగడం వల్ల షుగర్ వ్యాధి బారినుంచిమాత్రమే కాక, దాని కారణంగా వచ్చే గుండెజబ్బు వంటివాటినుండి కూడా తప్పించుకున్నవారవుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications