Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మధుమేహ నరం నొప్పి!

డయాబెటిస్ కనుక ఒక వ్యక్తిలో దీర్ఘకాలంపాటు అధిక స్ధాయిలో గ్లూకోజ్ కనుక వుంటే ఈ పరిస్ధితి ఏర్పడుతుంది. రక్తంలోని అధిక గ్లూకోజ్ రక్తనాళాలను వాటి ద్వారా నరాలను దెబ్బతీస్తుంది. హైపర్ గ్లైసీమియానే కాక, అధిక రక్తపోటు కూడా నరాలను నష్టపరుస్తుంది. పొగతాగుడు, ఆల్కహాల్ వంటివి కూడా నరాల నొప్పులకు కారణమవుతాయి. ఈ డయాబెటిక్ నరం నొప్పి ఎక్కడ వస్తుంది? డయాబెటిక్ నరం నొప్పి సాధారణంగా శరీర చివరి భాగాలు అంటే, పాదాలు, కాళ్ళు, చేతులు, మో చేతులు వంటివాటికి వస్తుంది.
డయాబెటిక్ ఫుట్ వున్న వారికి తప్పకుండా న్యూరోపతిక్ కాలి నొప్పి వస్తుంది. ఈ కారణంగా డయాబెటీస్ వున్నవారు ప్రతి సంవత్సరం పాదాల పరీక్షలు చేసుకోవాలని చెపుతారు. పాదాల పరీక్ష వలన కొత్త సమస్యలుంటే తెలుస్తాయి. రక్త ప్రసరణ సమస్యలు వెల్లడవుతాయి. కాలిగి గాయాలు, పొక్కులు, కీళ్ళ జబ్బులు ఏమైనా వుంటే బయటపడతాయి. ఈ సమస్యలుంటే పాదాలను ఛార్కోట్ ఫుట్ వ్యాధి అని కూడా అంటారు.
మధుమేహ నరం వ్యాధి లక్షణాలు ఎలా వుంటాయి? గుచ్చుకుంటున్నట్లు, చురుక్కుమనే భావన కలుగుతుంది. మంట పెడుతుంది. కత్తితో కోసిన భావన ఈ శరీర భాగాలలో కలుగుతుంది. ఈ నొప్పులు ఒక మాదిరి నుండి తీవ్రంగా కూడా వుంటాయి. వ్యాధి తీవ్రత అధికమయితే, ఆ భాగం తిమ్మిరెక్కిపోతుంది. డిసెస్తీసియా అనే పరిస్ధితి కొంతమందిలో ఏర్పడి, స్పర్శ కోల్పోతారు. ప్రతిరోజూ ముట్టుకునే వస్తువులు ముట్టుకుంటే చాలు గుచ్చుకునే నొప్పి వస్తుంది.
డయాబెటీస్ రోగులకు డయాబెటిక్ నరం నొప్పి చాలా తీవ్రమైనదిగా పరిగణించాలి. చేతులు, పాదాలు బాగా నష్టపోతాయి. వ్యాధి ముదిరితే, రోగి నిలబడటం కూడా కష్టమవుతుంది. కాళ్ళకు గాయాలు, అధిక రక్తపోటు, వంటివి కాలు తొలగించే పరిస్ధితికూడా తీసుకువస్తాయి. ఈ రకమైన నరాల నొప్పి డయాబెటిక్ రోగులలో తగ్గాలంటే, వారు జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ వంటివి మానేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం మంచి ఆహారం రక్తంలో షుగర్ స్ధాయిని నియంత్రిస్తుంది. అపుడు మాత్రమే వ్యాధి తగ్గుముఖానికి రాగలదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications