Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
షుగర్ వ్యాధి రోగులు లిక్కర్ తాగితే?

- స్మోకింగ్ మీలోని బ్లడ్ షుగర్ స్ధాయిని పెంచుతుంది. దానిని నియంత్రించటం సాధ్యం కాకుండా
చేస్తుంది.
- రక్తపోటు కూడా ఉన్న డయాబెటిక్ రోగులలో స్మోకింగ్ రక్తపోటును పెంచి మరెంతో హాని చేసే
అవకాశాలుంటాయి.
-షుగర్ బాధితులు స్మోకింగ్ చేస్తే గుండె జబ్బులు సంభవించి ప్రాణాంతక పరిస్ధితి ఏర్పడే అవకాశం
నూటికి ఎనభై శాతం వుంటుంది.
- డయాబెటిక్ రోగులు పొగతాగితే, వారి నరాల వ్యవస్ధ డామేజ్ అవుతుంది. అలానే కిడ్నీలకు
సంబంధించిన డామేజ్ కూడా వేగంగా జరుగుతుంది.
- రక్తనాళాలను స్మోకింగ్ కుచించుకునేలా చేస్తుంది కనుక గుండెజబ్బులు, న్యూరోపతి వంటి
సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
- స్మోకింగ్ కారణంగా మనలో కొలెస్టరాల్ స్ధాయి పెరుగుతుంది.
- స్మోకింగ్ చేసే వారిలో షుగర్ నివారణకు ఉపయోగించే మందులు ఎక్కువకాలం పనిచేయవు.
సక్రమంగా కూడా పనిచేయవు. కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు పొగతాగుడును విసర్జించటం అత్యుత్తమం
అని చెప్పాలి.
డయాబెటీస్ బాధితులకు, స్మోకింగే కాదు ఆల్కహాల్ కూడా ఏ మాత్రం మంచి చేయదు. వీరు ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకోకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్ బాగా పడిపోయే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ అలవాటును మానలేని పరిస్ధితి మీదయితే, ఖాళీ కడుపుతో ఎట్టిపరిస్ధితిలో ఆల్కహాల్ తీసుకోకండి. సాధ్యమైనంత వరకు ఒక్క పెగ్గుకు మించి త్రాగకండి. రాత్రి తాగే అలవాటు ఉంటే, నిద్రించేముందు మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి. ఒకవేళ అతి తక్కువగా ఉంటే ఏదన్నా తిని నిద్రపొండి. లేదంటే నిద్రలో హైపోగ్లైసీమియా దుష్పలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది.
ముఖ్యంగా మీరు తెల్సుకోవలసిన విషయం, ఆల్కహాల్ కారణంగా మీరు తీవ్రమైన హైపోగ్లైసీమియాకు గురయితే, గ్లూకాగాన్ ఇంజెక్షన్స్ వలన కూడా అంతగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఇనన్స్ లిన్ కారణంగా సంభవించే లోబ్లడ్ గ్లూకోజ్ ను మాత్రమే ఈ గ్లూకాగాన్ ఇంజక్షన్ సరిదిద్దగల్గుతుంది. దీని ప్రాసెస్ ను ఆల్కహాల్ అడ్డుకుంటుంది కనుక ఆల్కహాల్ కారణంగా ఏర్పడే లో బ్లడ్ గ్లూకోజ్ పరిస్ధితిని ఇది చక్కదిద్దలేదు. కనుక నోటి ద్వారా మీరు ఏదైనా తీపి పదార్ధాలు తినాల్సిందే.
ఆల్కహాల్ కారణంగా మీరు లోబ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కు చేరుకుని ఒకవేళ తెలివితప్పిపోతే మీ బ్లడ్ లోకి గ్లూకోజ్ ను ఇంజెక్టు చేయడం ద్వారా మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ను పెంచటం సాధ్యమవుతుంది. అది కూడా మీకు మీరుగా చేసుకోలేరు. వైద్యని సహకారం అత్యవసరం. కనుక ఆల్కహాల్ ను డయాబెటిక్స్ వదలివేయటం చాలా మంచిదని చెప్పాలి. అంతే కాకుండా అధికంగా ఆల్కహాల్ తీసుకోవటం వలన మీ లివర్ దెబ్బతింటుంది. అలాంటపుడు మీ లివర్ అవసరమైన సందర్భాలలో గ్లూకోజ్ ను తయారు చేసుకోలేదు. రిలీజ్ చేయలేదు. ఈ పరిస్ధితిలో డయాబెటీస్ ను కంట్రోల్ చేయటం చాలా అసాధ్యం అవుతుంది. ఇలా ఏ విధంగా ఆలోచించినా ఆల్కహాల్ ప్రమాదకరం అయినపుడు మనం ఆల్కహాల్ ను విసర్జించటం మంచిదిగా గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications