Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
షుగర్ తో శారీరకంగా బలహీన పడ్డారా?
ప్రపంచంలో ఎక్కడ చూసినా నేడు డయాబెటీస్ వ్యాధి బాగా వ్యాపించేస్తోంది. అలాగని మీరు కూడా దాని కోరలలో చిక్కుకోవాల్సిన పనిలేదు. ప్రపంచ డయాబెటీస్ ఫౌండేషన్ వారి సర్వే మేరకు ఆరోగ్య కర ఆహారం తీసుకుంటూ, శారీరక శ్రమ బాగా చేస్తే అది మీ జీవనాన్ని మెరుగుపరచి 80 శాతం వరకు టైప్ 2 డయాబెటీస్ రాకుండా చేస్తుంది. తినే అలవాట్లు మార్చటం కష్టమే. కాని రక్తంలోని షుగర్ ను నియంత్రించి మిమ్మల్ని షుగర్ ఫ్రీ చేసి మీలో కామవాంఛలను అధికంచేసే ఆహారాలు చూడండి. సాధారణంగా షుగర్ వ్యాధి వచ్చిన వారికి అంగం మెత్తబడి కామ వాంఛలు తగ్గుముఖం పడతాయి. అటువంటపుడు శరీర కండరాలకు తగిన బలం చేకూరాలంటే.....

పచ్చటి ఆకు కూరలు....
తోటకూర, బచ్చలికూర, గోంగూర, వంటి ఆకు కూరలు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.కేలరీలు తక్కువ పోషకాలు, విటమిన్లు, బేటా కెరోటిన్, అధికం మెగ్నీషియం వంటివి డయాబెటీస్ ను అరికడతాయి. ఆకు కూరలు తినటం అధికం చేస్తే అంటే రోజూ ఒక సారి తినే ఆహారంలో వంద గ్రాములకు తగ్గకుండా ఆకు కూర తింటే అది టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలను 14 శాతం తగ్గిస్తుందట.
గింజ ధాన్యాలు - తెల్ల చిక్కుడు గింజలు, సోయా గింజలు, అలచందలు మొదలైన గింజలలో పీచు అధికం. ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తాయి. వీటిలో గుండె జబ్బులు కలిగించే శాట్యురేటెడ్ కొవ్వు కూడా తక్కువ. తెల్లటి అన్నం చాలా తక్కువగా తినాలి. దానికి బదులు బీన్స్ వంటివి తింటే మీలో మెటబాలిక్ ప్రక్రియా బాగా జరిగి మీ పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా చేస్తుంది.
చేపలు - చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో మంటను తగ్గించి ట్రిగ్లసెరైడ్స్ను తగ్గిస్తాయి హెచ్ డిఎల్ అంటే మంచి కొల్లెస్టరాల్ పెంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బులను కూడా తగ్గిస్తాయి.
కొవ్వు తక్కువ ఉండే పాల ఉత్పత్తులు - పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్లు అధికం.తక్కువ కొవ్వు ఉండే పెరుగు వంటివి డయాబెటీస్ ను దూరం చేస్తాయి. కనుక గడ్డ పెరుగు కొవ్వు తక్కువగా ఉండేది రోజూ ఒక కప్పు తప్పక తినండి.
పుల్లటి పండ్లు - సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్, ద్రాక్ష, మొదలైన పండ్లు రుచిగా ఉండటమే కాదు డయాబెటీస్ నుండి రక్షణ కల్పిస్తాయి. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును కరిగించి ఇన్సులిన్ స్ధాయిలు సమతలం చేస్తాయి. కేలరీలు తక్కువ
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications